
జన్ ధన్ ఖాతాల్లో రూ.36,000 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్ ఖాతాల్లోని డిపాజిట్ల విలువ రూ.36,000 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ‘సివిల్ సర్వీసెస్ డే’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద 28 కోట్ల బ్యాంకు అకౌంట్లు ప్రారంభమయ్యాయని, వీటి ద్వారా బ్యాంకులు రూ.36,000 కోట్ల డిపా జిట్లను స్వీకరించాయని తెలిపారు. ఇది ప్రజల స్వయం సమృద్ధికి సంకేతమన్నారు. ప్రధాని మోదీ గురువారం ‘సివిల్ సర్వీసెస్ డే’ గురించి మాట్లాడనున్నారు. అలాగే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను బాగా అమలు చేసిన అధికారులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.