ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు లేనే లేవని కేంద్ర ప్రభుత్వ వర్గాల అందుతున్న సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం చేయాల్సిన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు తదితర అన్ని అంశాలతో కలిపి రూపొందించిన ముసాయిదాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించి ఆయన సమ్మతిని తీసుకున్నట్టు తెలుస్తోంది.