‘కొత్త’ సార్లకు జీతాల్లేవు!
♦ నూతన జిల్లాల్లో పోలీస్ అధికారుల తిప్పలు
♦ ఇంకా అందని డిసెంబర్ జీతం
♦ ఆర్థిక శాఖ నుంచి పీఏవోకు రాని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లా.. కొత్త పోస్టు.. మొదటి అధికారి.. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ సార్‌కు మూడో తేదీ వచ్చినా జీతం లేదు. ఇప్పుడీ పరిస్థితితో దాదాపు 140 మం ది పోలీస్ అధికారులు తంటాలు పడుతున్నా రు. దసరా నుంచి ఆరంభమైన నూతన జిల్లా ల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు ఇప్పటి వరకు డిసెంబర్ నెల జీతాలు అందలేదు. నూతన జిల్లాల్లో కొత్త సబ్ డివిజన్లు, కొత్త సర్కిళ్లు, కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఆ పోస్టులకు సంబంధిం చిన జీత భత్యాల ఆదేశాలు మాత్రం వెలువ రించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ నెల కుదరదు
రాష్ట్ర వ్యాప్తంగా 26 సబ్‌డివిజన్లు, 24 సర్కిల్
పోలీస్ కార్యాల యాలు, 92 పోలీస్‌స్టేషన్లు నూతన జిల్లాల్లో భాగంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్‌లో మంజూరయ్యాయి. ఈ పోస్టులకు సంబం« దించి చెల్లించే జీతభత్యాలకు సంబంధించిన ఆదేశాలు మాత్రం ఇంకా ఆర్థిక శాఖ నుంచి వెలువడలేదని పీఏవో (పే అండ్ అకౌంట్స్) అధికారులు తెలిపారు. దీనివల్ల ఈ పోస్టుల్లో పనిచేస్తున్న డీఎస్పీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లకు సంబంధించిన జీతభత్యా లను చెల్లించడం కష్టసాధ్యంగా ఉందని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఆర్థిక శాఖ నుంచి జీతభత్యాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో పోలీస్ శాఖ తన సొంత బడ్జెట్ నుంచి ఒక మెమో ద్వారా జీతభత్యాలను చెల్లిస్తున్నారు. ఇలా అక్టోబర్, నవంబర్ నెల జీతా లను నానా తంటాలు పడి చెల్లిం చారు. కానీ గడిచిన డిసెంబర్ జీతా లు మాత్రం చెల్లించడం సా«ధ్యప డదని బడ్జెట్ అధికారులు తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఇంతమంది అధికారు లకు ఆర్థిక శాఖ నుంచి కాకుండా సొంత ఖాతా నుంచి జీతాలు చెల్లిస్తే మిగతా కార్య క్రమాలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ఉన్నతాధికారులకు బడ్జెట్ సిబ్బంది తేల్చి చెప్పినట్టు తెలిసింది.
‘కొత్త’లోనే చేదు అనుభవం..
పీఏవోకు ఆర్థిక శాఖ నుంచి జీత భత్యాల ఆదేశాలు వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి ఏర్ప డిందని తెలిసినా.. జీతాలు అందుకోని అధికారులు మాత్రం అవమానకరంగా భావిస్తు న్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. జీతాలు అందుకున్న అధికారులు కొత్త సంవత్సరం ఎంజాయ్ చేస్తే తామేం పాపం చేశామో అన్న ట్టుగా ఉందని పలువురు అధికారులు ఉన్న తాధికారులకు మొరపెట్టకున్నట్టు తెలిసింది.