
‘డిజిటల్ విధానాన్ని అమలు చేయాలి’
ప్రజలకు బ్యాంకులు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: ప్రజలకు బ్యాంకులు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఐసీఐసీఐ బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల సమస్యలను అధిగమించేందుకు డిజిటల్ విధానాన్ని తక్షణం అమలు చేయాలని సూచించారు. నగదు రహిత లావాదేవీల కోసం అందరినీ సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.