సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక, ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేత ఈటల ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యం ఉన్న యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కసరత్తు పూర్తి చేశారు.
చదవండి: Huzurabad Bypoll: లెక్కలు వేసి.. ఎంపిక చేసి..
ముగ్గురు నేతల పేర్లతో కూడిన జాబితా మాణిక్యం ఠాగూర్‌కు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఓసీ అభ్యర్థుల పేర్లు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. బీసీ కేటగిరి నుంచి కొండా సురేఖ, ఓసీ కేటగిరి నుంచి కృష్ణారెడ్డి, ఎస్సీ కేటగిరి నుంచి సదానందం పేర్లను సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Huzurabad Bypoll: ‘రాజేందరన్న నువ్వు బాధపడకు.. గెలిచేది మనమే’
Comments
Please login to add a commentAdd a comment