ఖమ్మం సమావేశానికి కాంగ్రెస్ అతిరథ, మహారధులు | Top Leaders Coming To Khammam Congress Party Meeting | Sakshi
Sakshi News home page

ఖమ్మం సమావేశానికి కాంగ్రెస్ అతిరథ, మహారధులు

Published Sat, Feb 6 2021 12:34 PM | Last Updated on Sat, Feb 6 2021 12:37 PM

Top Leaders Coming To Khammam Congress Party Meeting - Sakshi

ఖమ్మం, ఫిబ్రవరి 6: పేదల కోసం ఇచ్చిన జీవోలను అడ్డం పెట్టుకుని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూములను రెగ్యులరైజ్ చేయించుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఖమ్మం పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, దీపక్ చౌదరి, బాల గంగాధర్ తిలక్, పుచ్చకాయల వీరభద్రం, మలీద్ వెంకటేశ్వర్లు, నూతి సత్యనారాయణ, ఎర్రబోలు శ్రీను, మొక్క శేఖర్ గౌడ్, బొందయ్య తదితరాలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల మీద రేపు  బూత్ కమిటీ స్థాయి సమావేశం జరగనుందని ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, 33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కమిటీల అధ్యక్షులు వస్తున్నారని భట్టి మీడియాకు వివరించారు. 

ఖమ్మం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో భట్టి విమర్శలు చేసారు. పట్టణంలో సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై భట్టి నిప్పులు చెరిగారు.  ప్రశ్నించిన వాళ్లపై కేసులు, అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. సొంత కాంట్రాక్ట్ సంస్థకు.. లేదంటే ఆయన మద్దతుదారులకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు కేటాయిస్తున్నారని అన్నారు. మంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని అన్నారు. మంత్రి తీరుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. 

పేదల కోసం ఇచ్చిన జీవో 58, 59ని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారని భట్టి విమర్శలు చేసారు. వ్యాపారాల కోసం మంత్రి పదవిని అడ్డం పెట్టుకోవడం దుర్మార్గమని భట్టి అన్నారు.అభివృద్ధి పనులను నాసిరకంగా చేస్తూ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వున్నారు. మంత్రి అజయ్ చేస్తున్న అక్రమాలపై పూర్తి స్థాయిలో సేకరించి విజిలెన్స్ కు అందిస్తామని అన్నారు. 

కాంగ్రెస్‌ను గెలిపించాలి
రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతురేక నల్ల చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేయడంపై ఆయన మండిపడ్డారు. 

ఎన్నికల కోసం సమాయత్తం
కాంగ్రెస్ పార్టీని ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా నాయకులతో రేపు మధ్యాహ్నం సమావేశం ఉంటుందని అన్నారు. ఖమ్మం పట్టణంలో ఉన్న నిరుద్యోగులు.. వాళ్ళ కోసం.. త్వరలో భారీ ర్యాలీ చేస్తున్నట్లు ప్రకటించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి: ఆధిపత్య పోరు.. కారు పార్టీలో కలకలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement