సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో వరద పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. వరద ముంపును ముందే అంచనా వేయకపోవడం వల్లే నష్టం తీవ్రత ఎక్కువ జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ప్రకృతి వైపరీత్యాలు చెప్పి వస్తాయా అంటూ భట్టి విక్రమార్కను పువ్వాడ ప్రశ్నించారు. అయినా ముందస్తుగా వరద ముంపు గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. కావాలనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.
చదవండి: కేటీఆర్‌కు పిండ ప్రదానం.. రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరి తర్వాత నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. భద్రాచలంలో గోదావరి వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment