
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ల వ్యవహా రం గల్లీలో కుస్తీ, ఢిల్లీ లో దోస్తీ అన్న చందంగా ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను సీఎం కేసీఆర్ కలిసిన ఫొటోలు జతచేసి, రెండు పార్టీలు ఒకటేనని మరోసారి రుజువైందన్నారు.