సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. అధ్యక్షుడి పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతుండగా.. హైకమాండ్ అందరి అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలో మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ గురువారం గాంధీ భవన్‌లో మరోసారి కోర్‌కమిటీ నేతలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ సభ్యులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తో ఆయన భేటీ కానున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందో చెప్పాలని కోర్‌కమిటీని కోరారు.
(చదవండి : పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుంది?)
పీసీసీ ఇవ్వాలని కోరా: ఎంపీ కోమటిరెడ్డి
పీసీసీ పదవి తనకు ఇవ్వాలని మాణిక్యం ఠాగూర్‌ను కోరానని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానికి తెలియజేశానన్నారు. తనకు పీసీసీ పదవి ఇస్తే పార్టీలో పెట్టగలనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షుడి నియామకం విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రాకపోయినా తాను మాత్రం బీజేపీలో చేరేది లేదని మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
(చదవండి : కోమటిరెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఉత్తమ్)
Comments
Please login to add a commentAdd a comment