
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. అటునుంచి నేరుగా ఖమ్మం చేరు కుని ఆదివారం అన్ని డీసీసీల అధ్యక్షులతో రాజకీయ పరిస్థితులు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉపఎన్నిక, ఖమ్మం, వరం గల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చిస్తారు. ఆపై ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై ఆ జిల్లా నేతలతో.. సాగర్ ఉపఎన్నికపై మిర్యాలగూడలో నల్లగొండ జిల్లా నేతలతో భేటీ అవుతారు