సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్‌కు చెందిన రియల్టర్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆయన ఈ సాయంత్రం కిడ్నాపైనట్టు తొలుత వార్తలొచ్చాయి. భూ వివాదం నేపథ్యంలో ఆయనను కిడ్నాప్ చేసినట్టు, రామచంద్రారెడ్డి డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. షాద్‌నగర్‌లోని టీచర్స్ కాలనీలో నివాసముండే రామచంద్రారెడ్డిని ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కిడ్నాప్ చేసినట్టు అతను పోలీసులకు తెలిపాడు.
కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్డారు. అంతలోనే కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డి హత్యకు గురైనట్టు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. షాద్‌నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో చాలా కాలంగా ఓ భూ వివాదం నడుస్తోంది. ఇరువర్గాల గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రారెడ్డి జడ్చర్ల సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేశారు.
(చదవండి: చైనా వస్తువుల బ్యాన్ తొందరపాటు చర్య: కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment