సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా రాంచంద్రారెడ్డి సమీప బంధువు ఐనా ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరుడు కిడ్నాప్‌కు పాల్పడి అనంతరం హత్య చేసినట్లు నిర్థారణ అయింది. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (షాద్నగర్లో రియల్టర్ దారుణ హత్య!)
షాద్‌నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో 9 ఎకరాల 9 గుంటల భూ వివాదమే హత్యకు కారణంగా కాగా, దీని వెనుక ఇంకెవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాంచంద్రారెడ్డి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనను షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేసిన దుండగులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద హతమార్చారు. నిన్న షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాంచంద్రారెడ్డి హత్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment