Ramchandra reddy
-
వీడిన రాంచంద్రారెడ్డి హత్యకేసు మిస్టరీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా రాంచంద్రారెడ్డి సమీప బంధువు ఐనా ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరుడు కిడ్నాప్‌కు పాల్పడి అనంతరం హత్య చేసినట్లు నిర్థారణ అయింది. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (షాద్‌నగర్‌లో రియల్టర్ దారుణ హత్య!) షాద్‌నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో 9 ఎకరాల 9 గుంటల భూ వివాదమే హత్యకు కారణంగా కాగా, దీని వెనుక ఇంకెవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాంచంద్రారెడ్డి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనను షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేసిన దుండగులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద హతమార్చారు. నిన్న షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాంచంద్రారెడ్డి హత్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
జడ్చర్ల: పట్టణానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు రాంచంద్రారెడ్డి(62) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేశారని వార్త వెలువడిన గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యాడన్న సమాచారం అందటంతో పట్టణవాసులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద హత్య చేశారు. రాంచంద్రారెడ్డి జడ్చర్ల కొత్తబస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన పెట్రోల్‌బంక్ నిర్వహిస్తున్నారు. కుటుంబమంతా హైదరాబాద్‌లో ఉంటుండగా ఇతను మాత్రం జడ్చర్లలో ఉండటంతో పాటు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండేవాడు. బాదేపల్లి సింగిల్‌విండో చైర్మన్‌గా పనిచేశారు. భూత్పూర్ జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. జడ్చర్ల శాసనసభ స్థానానికి కూడా అన్న టీడీపీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడి ఓటమి పాలయ్యారు. అనంతరం సుమారు నాలుగైదు ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాంచంద్రారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సత్యనారాయణరెడ్డి సోదరుడి కుమారుడు. చివరి రోజుల్లో జడ్చర్లలోని రాంచంద్రారెడ్డి ఇంట్లోనే సత్యనారాయణరెడ్డి ఉన్నారు. అయితే సత్యనారాయణరెడ్డికి సంబంధించిన ఆస్థుల వ్యవహారంలో, దాయాదులతో భూతగాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే హత్యకు గురయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాద్‌నగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో రాంచంద్రారెడ్డిని అతని వాహనంలోనే కిడ్నాప్ చేశారని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్, హత్యకు సంబంధించి తమవద్ద ఎలాంటి సమాచారం లేదని జడ్చర్ల ఎస్ఐ శంషోద్దీన్ తెలిపారు. కాగా హత్యకు గురైన రాంచంద్రారెడ్డి సొంత గ్రామం షాద్‌నగర్ సమీపంలోని అన్నారం. భార్య వాణి, కుమార్తెలు అఖిల, నిఖిల, కుమారుడు రఘు ఉన్నారు. పార్టీకీ తీరని లోటు: మల్లురవి రాంచంద్రారెడ్డి మృతికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. -
అనంతపురం: రాయదుర్గంలో 144 సెక్షన్
-
రామచంద్రారెడ్డి మృతిపై జానారెడ్డి సంతాపం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మృతి పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని స్వగృహంలో మృతి చెందారు. రామచంద్రారెడ్డి పంచాయితీ సభ్యుడి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని జానారెడ్డి అన్నారు. ఐదు సార్లు శాసన సభ్యునిగా, మంత్రిగా, న్యాయవాదిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం తీరని లోటు అని జానారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఇంటింటికీ నవరత్నాల ఫలాలు
► వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ► సీఎం ఒక్క హామీ నెరవేర్చిన దాఖలాలు లేవు ► రూ.200 కోట్లు ఖర్చుపెట్టి నంద్యాలలో గెలిచారు పీలేరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ అందుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం పీలేరు పట్టణ శివారు ప్రాంతం కడప మార్గంలోని ఎంఎం కల్యాణ మండపంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన నవరత్నాల సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దిరెడ్డి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి కుటుంబానికీ లక్షలాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తాయని తెలిపారు . గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీ సభ్యులు నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ రూ.200 కోట్లు డబ్బు ఖర్చు పెట్టి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని విజయం సాధించిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో సుమారు వంద పేజీల్లో 600కు పైగా హామీలు గుప్పించారని, ఇప్పటి వరకు ఒక్కటీ అమలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. రూ.84 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయాల్సి ఉంటే కేవలం రూ.11 వేల కోట్లు మాత్రమే చేసి ఏదో సాధించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. డ్వాక్రా రుణాలు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అడ్రస్ లేకుండా పోయాయన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఏ ఆపద వచ్చినా అండగా ఉంటా నని భరోసా ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పేదల ఉపాధి కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం టీడీపీ కార్యకర్తలకు ఫలహారంగా మారిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కుమార్‌రాజ, పీలేరు ఎంపీపీ డి.హరిత, కేవీపల్లె జెడ్పీటీసీ జీ.జయరామచంద్రయ్య, పార్టీ కన్వీనర్లు నారే వెంకట్రమణారెడ్డి, ఎం.వెంకట్రమణారెడ్డి, చింతల రమేష్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, వంగిమళ్ల మధుసూదన్‌రెడ్డి, ఎం.వెంకట్రమణారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, సీకే.ఎర్రమరెడ్డి, బీడీ నారాయణరెడ్డి, షామి యానా షఫీ, ఎస్.హబీబ్‌బాషా, కె.ఆనంద్, డి.వెంకట్రమణ, వీపీ రమేష్‌రెడ్డి, గాయం భాస్కర్‌రెడ్డి, కొత్తపల్లె సురేష్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యాప్రదాత డీఆర్
కావలి: నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ దార్శనికత ఆ నాటి యువకులపై ప్రగాఢమైన ముద్ర వేసింది. డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి(డీఆర్) (1929-2010) మీద ఆ ప్రభావం ప్రసరించింది. మద్రాసులో ఆయన చదువుకునే రోజుల్లో ఆ నగర పేవ్మెంట్ల మీద బతికే కూడు, గూడు లేని ప్రజలను చూసి ఆయన చలించిపోయాడు. విద్య అందరి జీవితాల్ని మారుస్తుందని భావించి తను పుట్టి పెరిగిన ఊరు కావలిని కార్యక్షేత్రంగా చేసుకొన్నాడు. సమాజాన్ని మార్చాలనే తన స్వప్నాన్ని సాకారం చేసుకొనేందుకు ఆయన బావ పుచ్చలపల్లి హరిశ్చంద్రారెడ్డి బాసటగా నిలబడటంతో నెల్లూరు జిల్లా మొత్తం తిరిగి విరాళాల సేకరణ చేశారు. నెహ్రూ స్ఫూర్తితో.... డీఆర్ తాను పెట్టబోయే కళాశాలకు నెహ్రూ పేరు పెట్టాలని భావించారు. దీనికి నెహ్రూ అనుమతి కోసం రామానుజరావునాయుడు, భుజంగ రాయశర్మలను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. దుర్గాబాయ్దేశ్ముఖ్ను కలుసుకొన్నారు. ఆమె వారిని మోటూరు సత్యనారాయణకు అప్పజెప్పారు. ఆయన వీరిని తీన్‌మూర్తి భవన్‌కు వెళ్లారు. మోటూరు వీరు వచ్చిన విషయం నెహ్రూకు చెప్పారు. తాను బతికుండగానే తన పేరు పెట్టడం ఇష్టం లేదని నెహ్రూ చెప్పారు. దీంతో కావలి కళాశాల అని పేరు పెట్టారు. నెహ్రూ మరణాంతరం ఇందిరాగాంధీ అనుమతితో 1965 లో నాటి ఉపరాష్ర్టపతి జాకీర్ హుస్సేన్ కావలి కళాశాల పేరును జవహర్ భారతిగా మార్చారు. 1951 వరకు ఉత్తర పెన్నా తాలుకాలో ఒక్క కాలేజీ కూడా లేదు. బెజవాడ గోపాలరెడ్డి చొరవతో నాటి అవిభక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఎస్.కుమారస్వామి నూరు ఎకరాల ప్రభుత్వ భూమిని కావలి కాలేజీకి మంజూరు చేశారు. విశ్వోదయ పర్యవేక్షణలో జవహర్ భారతి డిగ్రీ , పీజీ కళాశాల, రెండు ఇంజనీరింగ్ కళాశాలలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. బెజవాడ గోపాలరెడ్డి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్, విశ్వోదయ ప్రిపరేటరీ స్కూలు కొంతకాలం నడిచాయి. జవహర్ భారతిలో పెద్దాడ రామస్వామి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, భుజంగరాయ శర్మ, పట్టాభిరామరెడ్డి , మాధవరావు, కెవి రమణారెడ్డి, మాణిక్యరావు, నటరాజన్, రాధాకృష్ణ వంటి ఉద్దండులు అనేక మంది పనిచేశారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి కుమారస్వామి టాంపో, ఎస్.వి. యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ ఎం.రామానుజరావు నాయుడు ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. ఎందరినో గౌరవించారు.... ప్రతి సంవత్సరం నవంబరు 14న విశ్వోదయ వ్యవస్థాపక దినోత్సవం నాడు, కవి, గాయక, వైతాళికులను సన్మానించి గౌరవజీవిత సభ్యత్వాన్ని ప్రదానం చేస్తారు. ఆ విధంగా అందుకున్న వారిలో బీఎన్.రెడ్డి, ద్వారం నాయుడు, పీ.భానుమతి, దేవులపల్లి, జకీర్‌హుస్సేన్, కోకా సుబ్బారావు, జీడీ.నాయుడు, ఫాదర్మర్ఫీ. ఆల్బర్ట్ ఫ్రాంక్లిన్, దేశ్‌ముఖ్ దంపతులు, పీపీ.రావు, సీ.నారాయణరెడ్డి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెజవాడ గోపాలరెడ్డి, ఘంటశాల, ఎస్పీ.బాల సుబ్రహ్మణ్యం, కోటి, తనికెళ్ల భరణి, గద్దర్, ప్రముఖ పాత్రికేయులు, నార్ల, పొత్తూరి, ఏబీకే.ప్రసాద్, కె.రామచంద్రమూర్తి, రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పీవీ.రమణయ్య రాజా తదితరులు ఉన్నారు. నేడు డీఆర్ మెమోరియల్ లెక్చర్ కావలిఅర్బన్ : విశ్వోదయ వ్యవస్థాపకులు డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి 86వ జయంతిని శనివారం జవహర్ భారతి టీచర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ డీఆర్ మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేస్తున్నామని జేబీటీఏ అధ్యక్షుడు డాక్టర్ ఎం. చలపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ భారతి కళాశాల క్యాంపస్‌లోని శంకరన్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యారంగంలో ఎయిడెడ్ వ్యవస్థ ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తారని చెప్పారు. సామాజిక మార్పులో విద్య పాత్ర అనే అంశంపై నాగార్జున యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ నూర్‌బాషా ప్రసంగిస్తారని తెలిపారు. భారీస్థాయిలో సెమినార్లు... జవహర్ భారతి విద్యా ఔన్నత్యాన్ని పెంచడానికి సెమినార్లు భారీస్థాయిలో జరిగాయి. శంకరన్ జీఎస్.మేల్కొటే, అనంతశయనం అయ్యంగార్, వెన్నెలకంటి రాఘవయ్య, చరిత్రకారులు బిపిన్‌చంద్ర, నేలటూరు వెంకటరమణయ్య, ఓరుగంటి రామచంద్రయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, భాట్టం శ్రీరామమూర్తి, గౌతు లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో సరికొత్త ప్రయోగాలు ఏం జరిగినా జవహర్ భారతి ఆహ్వానించి జయప్రదంగా అమలు చేస్తూ వ చ్చింది. పేదరికంలో ఉండే విద్యార్థుల కోసం డీఆర్ ఎంతో చేశారు. జవహర్ భారతిలో ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ఒక సాధారణ వసతి గృహం, దుర్గాబాయి బాలికల వసతి గృహం ఉన్నాయి. డీఆర్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సాయం చేస్తూ వుండేవారు. ఈ వ్యక్తిగత సాయపరంపరను ప్రస్తుతం రెక్టార్ వినయ కుమార్‌రెడ్డి కొనసాగిస్తున్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణం... 1961లో పుచ్చలపల్లి హరిశ్చంద్రారెడ్డి ఓపెన్‌ఎయిర్ థియేటర్‌ను నిర్మించారు. యామిని కృష్ణమూర్తి, వేదాంతం సత్యనారాయణ శర్మ, శోభానాయుడు, మంజు భార్గవి, రత్న పాప, గద్దర్ మొదలైన వారు గజ్జెకట్టి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించేవారు. రజతోత్సవాల్లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, స్వర్ణోత్సవాల్లో మాజీ గవర్నర్ వీఎస్ రమాదేవి, వజ్రోత్సవాల్లో మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, ైవె స్ ఛాన్సలర్ రాజారామరెడ్డి, మాజీ వైస్ ఛాన్సలర్ సీఆర్ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ముగింపు సమావేశాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొని వజ్రోత్సవ సావనీర్ స్వప్నరేఖను ఆవిష్కరించారు. డీఆర్‌కు విశ్వోదయ ఆట విడుపు కాదు. కాలక్షేపమూ కాదు. ఆత్మసాక్షాత్కారము. ఆ మహానుభావుడికి ఇదే నా శ్రద్ధాంజలి. కేవీ కోటిలింగం, విశ్రాంత అధ్యాపకుడు, కావలి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ -
కార్యకర్తలకు అండగా ఉంటాం
సాక్షి, నెల్లూరు: ‘సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తామనుకున్నాం. దురదృష్టవశాత్తు రాలేకపోయాం. అయినా వెరవం. కార్యకర్తలకు అండగా నిలబడతాం. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీ అండ ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించేలా కృషి చేద్దాం’ అని వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, అంబటి రాంబాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం జరి గింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కోవూరు, నెల్లూరుసిటీ, రూరల్, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, కావలి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్షించారు. పార్టీ గెలుపోటములపై అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలను తెలుసుకున్నారు. పరిశీలకులుగా వచ్చిన రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, అంబటి రాంబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాలేదన్న బాధ అందరికీ ఉందన్నారు. ఆ బాధను మరిచి పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ స్వల్ప ఓట్లతేడా అధికారానికి దూరమైందన్నారు. భవిష్యత్‌లో పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేసి ముందుకు సాగుదామన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, రూర ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్, ఆనం వెంకటరమణారెడ్డి, పాండురంగారెడ్డి, వహీద్‌బాషా పాల్గొన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాబోయే ఐదేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటామని పార్టీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరులతో చెప్పారు. పార్టీ అభ్యర్థుల గెలుపోటములకు కారణాలను తెలుసుకునేందుకే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారన్నారు. పార్టీ పటిష్టతకు చర్యలు : డీసీ గోవిందరెడ్డి పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్ది పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టనున్నట్టు పరిశీలకుడు డీసీ గోవిందరెడ్డి విలేకరులతో చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. నేతలు, కార్యకర్తల అభిప్రాయాల నివేదికల ఆధారంగా పార్టీ అధినేత సైతం సమీక్షించి రాబోయే కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారన్నారు. వైఎస్సార్సీపీ స్వల్ప ఓట్లతోనే ఓటమి చెందిందన్నారు. దీనిని సరిదిద్దుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని గోవిందరెడ్డి చెప్పారు. కార్యక ర్తలకు పార్టీ అండగా ఉంటుంది : అంబటి రాంబాబు ‘పార్టీ అధికారంలోకి వస్తుందని అందరం ఆశించాం. దురదృష్టవశాత్తు ఓటమి చెందాం. అయినా తిరిగి లేచి పార్టీ కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది’ అని అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో చెప్పారు. వైఎస్సార్సీపీ 67 మంది శాసన సభ్యులను గెలవడం సామాన్య విషయం కాదన్నారు. పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. చిన్న సమస్య వచ్చినా పోరాటం సాగిస్తామన్నారు. కాంగ్రెస్ అంతరించిందన్నారు. అక్రమ కేసులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు బెదరవన్నారు. -
జనవరిలో ముక్కంటికి కుంభాభిషేకం
రూ.10కోట్లతో అభివృద్ధి పనులు శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ముక్కంటీశుని ఆలయంలో కుంభాభిషేకాన్ని 2015 జనవరిలో నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో రామచంద్రారెడ్డి గురువారం ముఖ్యమైన అధికారులు, ప్రధాన అర్చకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000లో కుంభాభిషేకం నిర్వహించారని, తర్వాత 2012లో జరగాల్సి ఉండగా వారుుదా పడుతూ వస్తోందని చెప్పారు. ప్రధాన అర్చకులు బాబు గురుకుల్ మాట్లాడుతూ 12 ఏళ్లకొకసారి జరగాల్సిన కుంభాభిషేకాన్ని వాయిదా వేయడంతోనే ఆలయానికి కొన్ని ఇబ్బందులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో రెండు గంటలపాటు కుంభాభిషేకంపై చర్చలు సాగాయి. 2015 జనవరిలో కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. స్వామివారి ధ్వజస్తంభానికి ఉన్న రాగి తొడుగును తొలగించి, రూ. 5 కోట్లతో బంగారు తొడుగు ఏర్పాటు చేస్తారు. మే నెలలో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. -
రాజకీయ సన్యాసానికి సిద్ధమా?
రాయదుర్గం, న్యూస్‌లైన్ : ‘రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలుస్తున్న నీకు ఘోర పరాజయం తప్పదు. అప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జేసీకి సవాల్ విసిరారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని పదవులూ అనుభవించిన జేసీ దివాకర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాయకుడినే ఓడించి టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా మిగలరని, నేనొక్కడినే కాంగ్రెస్‌లో ఉంటానని గొప్పలు చెప్పిన జేసీ.. అందరికన్నా ముందే పార్టీని ఎందుకు వీడారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాయదుర్గం నియోజకవర్గంలో అల్లుడికి టికెట్ కోసం నీచరాజకీయాలు చేసింది నీవు కాదా? గతంలో చంద్రబాబును నోటికొచ్చినట్లు తిట్టిన నీవు.. అదే నోటితో బాబును పొగడడం నీ అవకాశవాదానికి నిదర్శం కాదా? సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో జగన్‌ను పొగిడిన జేసీ.. వైఎస్ఆర్సీపీలో చేరేందుకు అవకాశం లేకపోవడంతో జగన్‌ను తిట్టడం మొదలు పెట్టారు. చంద్రబాబుకు కన్యాశుల్కంలా ముడుపులు అప్పజెప్పి టీడీపీలో చేరి నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తన కారు డ్రైవర్, వంట మనిషి పేర్ల మీద వేల ఎకరాల గనుల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకున్న మాట వాస్తవం కాదా అన్న విషయాన్ని ప్రజలకు తెలపాలి. తాడిపత్రిలోని సిమెంట్ ఫ్యాక్టరీల్లో షేర్లు, బినామీ పేర్ల మీద భాగాలు పెట్టుకున్న విషయం గురించి ఏం చెబుతారు? గతంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని విలువైన భూములను కబ్జాచేసి, లబ్ధిపొంది.. నేడు అతడిపై కేసులు నమోదు చేయించిన నీచ సంస్కృతి ఎవరిది? రాయదుర్గంలో కూడా అలాంటి పరిస్థితిని కల్పించడానికి వస్తున్నారన్న విషయాన్ని ఇక్కడి ప్రజలు అర్థం చేసుకున్నారు. 150 మంది హత్యలకు జేసీ కారకుడని సీనియర్ టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు విమర్శిస్తే ఆ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదో జేసీ ప్రజలకు వివరణ ఇవ్వాలి. రాయదుర్గం నియోకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీ అల్లుడు దీపక్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు, ఆదాయానికి పొంతన లేని విషయం ప్రజలకు తెలుసు. ఆ ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలి. నీచ రాజకీయాలు చేస్తూ సత్యహరిశ్చంద్రుడి మనవడిలా జేసీ మాట్లాడడం సిగ్గుచేటు. మీ ధన దాహం, దౌర్జన్యాలు, రక్తదాహం, భూ దాహం ఎప్పుడు తీరుతుందో చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. నీలా నీచ రాజకీయాలు చేయడం మా వల్ల కాదు. జేసీ లాంటి వ్యక్తులను ఎన్నికల్లో ఘోరంగా ఓడించడానికి ప్రజలంతా నడుం బిగించి సిద్ధంగా ఉన్నారు. -
కత్తిమీద సామే!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తారాస్థాయిలో గ్రూపు విభేదాలున్న జిల్లా కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారనుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపుల మధ్య విభేదాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి అనుచరులకు కౌన్సిలర్ టిక్కెట్లు దక్కుతా యో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల ఎంపిక స్థానికంగానే ఉంటుందని పీసీ సీ ఇప్పటికే సంకేతాలిచ్చింది. స్థానిక ఎమ్మెల్యే లేదా గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ చైర్మన్‌తోపాటు ఇద్దరు డీసీసీ సభ్యులతో కూడిన కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని వెల్లడించింది. కానీ అన్ని మున్సిపాలిటీల్లో నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం నేతలు ఎవరికి వారే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో ఈ విభేదాలు మరింత ముదిరాయి. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక సజావుగా సాగడం ప్రశ్నార్థకమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలుండగా, మందమర్రి మున్సిపాలిటీకి ఈసారి కూడా ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన ఆరింటిలో ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, భైంసా మున్సిపాలిటీలు జనరల్ మహిళలకు రిజర్వు అయ్యాయి. నిర్మల్ మున్సిపాలిటీ జనరల్ అయింది. దీంతో చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ‘సెలక్ట్.. ఎలక్ట్..’ అనే పద్ధతిపైనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. వార్డుల్లో ఉండే అన్ని వర్గాల అభిప్రాయం మేరకే తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. అన్ని చోట్లా గ్రూపులే.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ విషయానికి వస్తే డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, పీసీసీ కార్యదర్శి సుజాత మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సోనియా కృతజ్ఞత సభలో ఇరువర్గాల నాయకులు ఏకంగా పరస్పర దాడులకు దిగారు. సమావేశం వేదికపై ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈ రెండు వర్గాల నేతలు ఏకతాటిపైకి రావడం ప్రశ్నార్థకమే అవుతుందనే అభిప్రాయం నెలకొంది. భైంసా మున్సిపాలిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి. ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌రెడ్డిలు ఆధిప త్య పోరు సాగుతోంది. మున్సిపల్ కౌన్సిలర్ టిక్కెట్ల విషయంలో ఎవరిది పైచేయి అవుతుందో తెలియని పరిస్థితి. బెల్లంపల్లిలో ఎమ్మెల్సీ వెంకట్రావు అనుచరుడైన మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గాలున్నాయి. బెల్లంపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చినుముల శంకర్ ఉన్నారు. ఈ మూడు గ్రూపులు కలిస్తేగానీ కౌన్సిలర్ల టిక్కెట్లపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాల్లేవు. మంచిర్యాలలో దివాకర్‌రావు, ప్రేంసాగర్‌రావు గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇటీవల ఎమ్మెల్యే అరవిందరెడ్డి కూడా రాకతో మూడు బలమైన గ్రూపులుగా తయారైంది. ఎవరిని ఆశ్రయిస్తే టిక్కెట్టు వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అరవింద్‌రెడ్డి అప్పుడే ఓ అడుగుముందుకేసి సమష్టిగా చర్చించి ఎంపిక చేస్తామని ప్రకటించారు. ఎదుటి వర్గం నేతల నుంచి స్పందన కరువైంది. కాగజ్‌నగర్‌లో మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తగిరి అ హ్మద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గజ్జిరామయ్య, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు రమణారావు తదితరుల మ ధ్య అంతర్గత విభేదాలున్నాయి. టిక్కెట్ల విషయంలో ఎవరికి వారే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. నిర్మల్‌లో కాంగ్రెస్ గ్రూపులు బహిర్గతం కాకపోయినా అంతర్గతంగా ఉన్నాయి. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు నుంచి ఉన్న నాయకులకు, ఆయన కాంగ్రెస్‌లో చేరాక తెరపైకి వచ్చిన నేతలకు మధ్య విభేదాలున్నాయి. ఇక్కడ కూడా టిక్కెట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం నెలకొంది. -
కాంగ్రెస్ నేతల మధ్య కుదరని ‘ఐ’క్యత
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జైత్రయాత్ర సభ నిర్వహణ ఏర్పాట్లు బాలారిష్టాలు దాటడం లేదు. నిర్మల్‌లో 13న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు గడువు సరిగ్గా ఆరు రోజులే ఉంది. ఓ వైపు ఆ పా ర్టీలో కొలిక్కిరాని గ్రూపు తగాదాలు.. మరోవైపు రెండు రోజుల ముందు మొదల య్యే రచ్చబండ మూడో విడత.. 12, 13 తేదీల్లో ఢిల్లీకి టీ-మంత్రుల పయనం.. ఇవన్నీ జైత్రయాత్రకు ప్రతిబంధకాలుగా కనిపిస్తున్నాయి. నిర్మల్ కేంద్రంగా నిర్వహించే సభకు సక్సెస్ చేయడం కోసం బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డితో విభేదాలున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు దూరంగా ఉన్నారు. ఆయనతోపాటు ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తదితరులు హాజరుకాలేదు. ఓ వైపు అధికార కార్యక్రమాలు, మరోవైపు టీ-మంత్రుల పర్యటనల నేపథ్యంలో సభను 13న నిర్వహిస్తారా? లేక మరో రోజుకు వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీసీసీ సభకు ప్రేమ్‌సాగర్ దూరం నిర్మల్‌లో 13న నిర్వహించే బహిరంగ సభ సక్సెస్ కోసం ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు రాలేదు. అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సమావేశానికి హాజరు కాలేదు. అయితే డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి వర్గంగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నడిపెల్లి దివాకర్‌రావు కార్యకర్తలతో హాజరయ్యారు. ప్రేమ్‌సాగర్‌రావు గ్రూపునకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, జాదవ్ అనిల్‌కుమార్‌లతోపాటు పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరైనా, ఆశించిన స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యేలా నాయకత్వం తీసుకున్న చర్యలు కనిపించలేదు. జైత్రయాత్ర సభ సక్సెస్‌కు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావించి ఏర్పాటు చేసిన సమావేశానికి కేడర్ అంతంత మాత్రంగానే హాజరుకావడం, రెండు గ్రూపులకు చెందిన కొందరు నేతలు హాజరైనా ముఖ్య నేతల గైర్హాజరు కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. జైత్రయాత్రపై రచ్చబండ ప్రభావం నిర్మల్‌లో 13న జైత్రయాత్ర సదస్సుకు కాంగ్రెస్ పార్టీ భారీ సన్నాహాలు చేస్తుండగా అంతకు రెండు రోజుల ముందే రచ్చబండ మూడో విడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇటు జైత్రయాత్ర సభ, అటు మూడో విడత రచ్చబండ రెండు కూడా పార్టీకి ప్రతిష్టాత్మకమే. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభ నిర్వహిస్తే రచ్చబండ ప్రభావం పడే అవకాశం ఉంది. సమైక్యాంధ్ర, తెలంగాణకు చెందిన మంత్రులు ఈనెల 12,13 తేదీల్లో వేర్వేరుగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)ను కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రుల బృందం వేర్వేరుగా తెలంగాణ విభజనకు సంబంధించిన 11 విధివిధానాలను సూచించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడం టీ-మంత్రులకు అనివార్యం. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభకు టీ-మంత్రులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేస్తేనే జైత్రయాత్ర సభను సక్సెస్ చేసుకోవచ్చని.. దీనికి నిర్మల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కు చొరవ చూపి ప్రభుత్వం ప్రకటన చేయించాలని సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి సూచించడం గమనార్హం. ఈ క్రమంలో నిర్మల్‌లో సభపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఆత్మ గౌరవ కాదు.. టీడీపీకి అంతిమ యాత్ర
రాయదుర్గం, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 25 నుంచి ఆత్మగౌరవ యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నారని, విభజనకు కారణమైన చంద్రబాబు రాజకీయానికి సీమాంధ్రలో ఇది అంతిమ యాత్ర అవుతుందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయదుర్గంలో కాపు భారతి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరం, విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షల శిబిరంలో ఆయన మాట్లాడారు. వీహెచ్ హనుమంతరావుకు తిరుపతిలో పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందని హెచ్చరించారు. విభజన కోసం ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని బస్సు యాత్ర చేపట్టాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును నిలదీయకుండా ఆ పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిగ్గు, మానవత్వం ఉంటే చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోతే సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.