
పి.రామచంద్రారెడ్డి (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: శాసనసభ మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మృతి పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని స్వగృహంలో మృతి చెందారు. రామచంద్రారెడ్డి పంచాయితీ సభ్యుడి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని జానారెడ్డి అన్నారు. ఐదు సార్లు శాసన సభ్యునిగా, మంత్రిగా, న్యాయవాదిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం తీరని లోటు అని జానారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.