Former Speaker
-
బైడెన్ వల్లే ఓడిపోయాం
వాషింగ్టన్: ఎన్నికల ఫలితాలపై డెమొక్రాట్లలో ఆగ్రహం వెల్లువవుతోంది. పార్టీ హారిస్, బైడెన్ అనుకూల వర్గాలుగా చీలిపోయింది. ఓటమికి కారణం మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. ఆయన పోటీ నుంచి తొందరగా తప్పుకొని ఉంటే డెమొక్రాట్లు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారన్నారు. అయితే ఓటమికి హారిస్ సాకులు చెబుతున్నారని బైడెన్ మాజీ సహాయకుడు ఆక్సియోస్ చెప్పారు. గెలవకుండానే ఒక బిలియన్ డాలర్లు ఎలా ఖర్చుచేశారని ప్రశ్నించారు. జో బైడెన్‌ను బయటకు నెట్టడానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహాదారులు పార్టిలో అంతర్గత కుమ్ములాటలను బహిరంగంగా ప్రోత్సహించారని ఆరోపించారు. బైడెన్‌ను గద్దె దించడానికి కుట్ర పన్నిన వారే ఎన్నికల్లో ఓటమికి కారణమని డెమొక్రాట్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ ఆరోపించారు. -
రాజకీయ రంగంలో ఒకేరోజు రెండు విషాదాలు
బెంగళూరు: రాజకీయ రంగంలో ఒకేరోజు రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటక, ఒడిశా మాజీ స్పీకర్లు మంగళవారం తుదిశ్వాస విడిచారు. కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ దారదహళ్లి బైరేగౌడ చంద్రేగౌడ(87) ఈరోజు తెల్లవారుజామున చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దారదహళ్లిలోని తన నివాసంలో కన్నుమూయగా, ఒడిశా మాజీ స్పీకర్ మహేశ్వర్ మొహంతి(67) భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1936 ఆగస్టు 26న జన్మించిన దారాదహళ్లి బైరేగౌడ.. రాజకీయంగా సుధీర్ఘసేవలు అందించారు. కర్ణాటక స్పీకర్‌గా మాత్రమే కాకుండా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. జనతా దళ్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో కొనసాగింది. 1983-85 వరకు స్పీకర్‌గా పనిచేసిన ఆయన.. 1986లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. Former Speaker of Karnataka Legislative Assembly Daradahalli Byregowda Chandregowda passed away at his residence in Mudigere Taluk's Daradahalli in Chikmagalur District early morning today: Karnataka DIPR (file pic) pic.twitter.com/pk7texGTVG — ANI (@ANI) November 7, 2023 ఒడిశా మాజీ స్పీకర్ మహేశ్వర్ మొహంతి(67) బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొహంతి కన్నుమూశారు. 2004-08 మధ్య ఒడిశా ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన మెహంతీ.. పూరి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సీఎం నవీన్ పట్నాయక్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో దుండగుల కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. Odisha | Former Speaker and ex-minister Mahwswar Mohanty passed away while undergoing treatment at a private hospital in Bhubaneswar. (File photo) pic.twitter.com/ABrQkF7YgN— ANI (@ANI) November 7, 2023 ఇదీ చదవండి: మాజీ డ్రైవరే హంతకుడు -
మనోహర్ జోషి పరిస్థితి ఆందోళనకరం
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా మారింది. శివసేన సీనియర్ నేత అయిన జోషిని మెదడులో రక్తస్రావంతో రెండు రోజుల క్రితం హుటాహుటిన ముంబైలోని పీడీ హిందూజా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన స్పృహలోలేరని, దాదాపు కోమాలో ఉన్నారని ఆయన కుమారుడు ఉన్మేశ్ సోమవారం చెప్పారు. ‘ 85 ఏళ్ల జోషి ఐసీయూలో ఉన్నా వెంటిలేటర్ సాయంలేకుండా సాధారణ శ్వాస తీసుకుంటున్నారు. ప్రస్తుత రక్తస్రావం పరిస్థితి అదుపులో ఉంది’ అని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దేశ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెల్సుకున్నారు. 1995లో బీజేపీతో పార్టీ సంకీర్ణం అయ్యాక మహారాష్ట్రలో శివసేన నుంచి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి పొందిన వ్యక్తి జోషియే. 1966లో శివసేన స్థాపించాక అప్పటినుంచీ జోషి అందులో సభ్యునిగా కొనసాగుతున్నారు. లోక్‌సభకు గతంలో స్పీకర్‌గా వ్యవహరించారు. ముంబై మేయర్‌గా సేవలందించారు. మహారాష్ట్ర శాసనసభలో విపక్షనేతగా కొనసాగారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. -
ఏఎస్ఐ వర్సెస్ మాజీ స్పీకర్: సిగ్గుండాలి.. మీకు పిల్లలు లేరా?
సాక్షి, బెంగళూరు/బనశంకరి: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్‌పై బెంగళూరు జేపీ నగర పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే గోపి అనే ఏఎస్ఐ మండిపడ్డారు. ఆదివారం గోపి మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అయింది. ‘‘మాజీ సభాధ్యక్షునికి మొదటి నుంచీ గౌరవం ఇస్తున్నాం. కానీ ఆయన అందరు రాజకీయనేతల కంటే భిన్నంగా ఉంటారు. ప్రవర్తన సరిగాలేదు’’ అని ఆడియో క్లిప్‌లో విమర్శలు చేశాడు. ‘‘ఇతను (రమేశ్‌కుమార్) రోడ్డులో వెళుతుండగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఏమి చెబుతారంటే రహదారుల్లో సక్రమంగా వాహనాలు తనిఖీలు చేయడం లేదంటారు. మా కుటుంబాల గురించి మాట్లాడతారు. మేం ఇతని కుటుంబం గురించి మాట్లాడామా? మా విధుల గురించి మాట్లాడాలి. ఇతనిపై ఉన్న గౌరవం కూడా పోయింది’’ అని ఏఎస్ఐ అన్నారు. తనిఖీలు చేయడం మీ భార్యపిల్లలకు మంచిది కాదని ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసం అని మాజీ స్పీకర్‌పై మండిపడ్డారు. వివాదం ఎక్కడ మొదలైంది రోడ్డుపై వాహనాలను నిలిపి జరిమానా విధిస్తున్న చింతామణి పట్టణ పోలీసులను ఎమ్మెల్యే రమేశ్‌కుమార్ మందలించారు. ఇది వివాదానికి దారితీసింది. కాగా శుక్రవారం, ఎస్ఐ ముక్తియార్ సిబ్బందితో తాలూకాలోని మడికెరి క్రాస్‌లో వాహనాలను అడ్డుకుని జరిమానా విధిస్తున్నారు. ఈ సమయంలో శ్రీనివాసపుర నుంచి బెంగళూరుకు వెళుతున్న రమేశ్‌కుమార్ తన వాహనాన్ని నిలిపి.. ‘‘పోలీసులను పిలిచి రోడ్ల మధ్యలో వాహనాలను నిలిపి జరిమానా విధించరాదని ఇటీవల హోంమంత్రి ఆదేశాలు జారీచేశారు కదా. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది మీ కుటుంబానికి మంచిదికాదు. ఏం డాక్యుమెంట్లను చెక్ చేస్తారు? సిగ్గుండాలి మీకు. హోంమంత్రి చెప్పినా వినిపించుకోరా?, ఇదే మీ ఉద్యోగమా మీకు’’ అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఏఎస్ఐ ఆడియోపై రమేశ్‌కుమార్ స్పందిస్తూ టోల్గేట్ వద్ద పోలీసుల ప్రవర్తన బాధ కలిగించడంతో మీకు పిల్లలు లేరా? వెళ్లండి అని అన్నాను అని చెప్పారు. ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి! చదవండి: Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్ -
మాజీ స్పీకర్ కన్నుమూత
చెన్నై : తమిళనాడు మాజీ అసెంబ్లీ స్పీకర్, ఏఐడీఎంకే సీనియర్ నేత పీహెచ్ పాండియన్ (74) శనివారం మృతి చెందారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుత్ను ఆయన వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన డీఎంకే నుంచి వైదొలిగిన తర్వాత ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఏఐడీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా చేరారు. చెరన్మదేవి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాండియన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన 1985 నుంచి 1989 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా సేవలు అందించారు. అదేవిధంగా 1999లో తిరునెల్వేలి లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందారు. పీహెచ్ పాండియన్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న సమయంలో స్పీకర్‌కు ప్రత్యేకమైన ఆధికారాలు ఉన్నాయంటూ శక్తివంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఏఐడీఎంకే పార్టీకి తన విశేష సేవలను అందించారు. -
తల్లికి తలకొరివి పెట్టిన మాజీ స్పీకర్
సాక్షి, శ్రీకాకుళం : శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకురాలు కావలి ప్రతిభా భారతి మాతృమూర్తి కొత్తపల్లి లీలావతమ్మ(85) అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. తల్లి పార్థివదేహానికి ప్రతిభా భారతి తలకొరివి పెట్టారు. మనుమరాలు గ్రీష్మాప్రసాద్, కుటుంబ పెద్దలు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాజ్జీ), రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొళ్ల అప్పలనాయుడు, కేసరి తదితరులు ప్రతిభా భారతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతిభా భారతి 1999-2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా పనిచేశారు. -
ఏపీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి గుండెపోటు
ఆరిలోవ (విశాఖ తూర్పు): ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభా భారతి గుండెపోటుకు గురయ్యారు. ఆమె నగరంలోని ఆరిలోవ హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతి భా భారతి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యు లు ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆమె తండ్రి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య (92) వృద్ధాప్యంతో అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయనను గురువారం అర్ధరాత్రి సమయంలో స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావ లి నుంచి విశాఖలోని పినాకిల్‌కు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అంబులెన్స్ వెంట కారులో కుమార్తె గ్రీష్మ ప్రసాద్, బంధువులతో కలిసి వస్తుండగా ప్రతిభా భారతి గుండెపోటుకు గురయ్యారు. కారు రణస్థలం దాటగానే ఆమెకు వాంతులు వచ్చాయని కుమార్తె గ్రీష్మ తెలిపారు. తన తాతయ్యతో పాటు తల్లిని కూ డా అదే ఆస్పత్రిలో చేర్పించామన్నారు. ప్రతిభా భార తి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పున్నయ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. -
వెంటిలేటర్‌పై సోమ్‌నాథ్ చటర్జీ
కోల్‌కతా: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ(89)ని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత నెల ఛటర్జీకి మెదడులో రక్తస్రావం కావడంతో వైద్యశాలలో చేర్పించారు. చాలా రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నట్లుగా కనిపించడంతో గత వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి పంపారు. మళ్లీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఆయనను మూడు రోజులకే తిరిగి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ‘ఆయనకు డయాలసిస్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు గుండె సహకరించదు. దీంతో ఆయనకు ఆదివారం ఉదయం చిన్నగా గుండెపోటు వచ్చింది. ఇప్పుడు ఫరవాలేదు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని వైద్యులు చెప్పారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. -
లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్య పరిస్థితి విషమం
కోల్కత్తా : లోక్‌సభ మాజీ స్పీకర్, సీపీఎం సీనియర్ నేత సోమనాథ్ చటర్జీ (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్ని సంబంధిత వ్యాధితో భాదపడుతున్న ఆయనను కోల్‌కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమ్‌నాథ్‌కు డయాలసిస్ నిర్వహించడంతో పాటు వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నామని ఆదివారం వైద్యులు పేర్కొన్నారు. బెంగాల్ నుంచి సీపీఎం తరుఫున పదిసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. యూపీఏ-1 ప్రభుత్వంలో 2004-2009 మధ్య కాలంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. ఆయన 1971 నుంచి 2009 వరకు ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కేవలం ఒక్కసారి మాత్రమే 1984 ఎన్నికల్లో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సీపీఎంలో చేరిన సోమనాథ్ 2008 వరకు ఆ పార్టీలో కొనసాగారు. అయితే 2008లో యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించుకున్నప్పటీకి స్పీకర్‌గా కొనసాగడంతో పార్టీలో నుంచి బహిష్కరించారు. -
రామచంద్రారెడ్డి మృతిపై జానారెడ్డి సంతాపం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మృతి పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని స్వగృహంలో మృతి చెందారు. రామచంద్రారెడ్డి పంచాయితీ సభ్యుడి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని జానారెడ్డి అన్నారు. ఐదు సార్లు శాసన సభ్యునిగా, మంత్రిగా, న్యాయవాదిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం తీరని లోటు అని జానారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి కన్నుమూత
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని స్వగృహంలో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం ఇంట్లోని బాత్రూంలో ఆయన జారిపడ్డారు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆçస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి చెందారు. ఆయనకు భార్య శాంతారెడ్డి, ఇద్దరు కుమారులు నిరూప్‌రెడ్డి, స్వరూప్‌రెడ్డి, కూతురు శ్రీదేవి ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో 1929 డిసెంబర్ 3న ఆయన జన్మించారు.ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. హైదరాబాద్, సంగారెడ్డిలలో న్యాయవాదవృత్తి నిర్వహించా రు. 1957లో పటాన్చెరువు పంచాయతీ సమి తి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1989 వరకు ఐదుసార్లు సంగారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో 1989లో శాసనసభ స్పీకర్‌గా పని చేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్లో భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 2004 లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యా రు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరం గా ఉన్నారు. రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు నిరూప్‌రెడ్డి సుప్రీంకోర్టులో న్యాయవాది. చిన్న కుమారుడు స్వరూప్‌రెడ్డి కెమికల్ ఇంజనీరింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు. కూతురు శ్రీదేవి కూడా న్యాయవిద్యను అభ్యసించారు. లోకా యుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, గుజరాత్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఎంపీలు డాక్టర్ కె.కేశవరావు, కె.ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీ కర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితోపాటు పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు రామచంద్రారెడ్డి నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయంత్రం రాయదుర్గం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితరం నాయకుడు రామచంద్రారెడ్డి అని కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు రామచంద్రారెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. -
పార్టీలు మారిన వారికి ముప్పు తప్పదు
- గోడ దూకిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారు - పార్టీలు మారకుండా చట్ట సవరణ చేయాలి - జనచైతన్య వేదికలో వక్తల డిమాండ్ తిరుచానూరు ప్రజలెన్నుకున్న పార్టీకి వెన్నుపోటు పొడిచే నాయకులకు భవిష్యత్‌లో ముప్పు తప్పదని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుపతిలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఈ చర్చాగోష్టికి నగరంలోని విభిన్న వర్గాల మేధావులు, రాజకీయ విశ్లేషకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకుడిలా వ్యవహరించడం బాధాకరమన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 13 మందిపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదును సాంకేతిక కారణాలతో తోసిపుచ్చడంతో, స్పీకర్ నైతిక బలాన్ని కోల్పోయారని విమర్శించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఫిరాయింపులకు పాల్పడడం రాజకీయ వ్యభిచారమేనన్నారు. ఈ నెల 31న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బిపి.జీవన్‌రెడ్డి అధ్యక్షతన ఇదే అంశంపై చర్చాగోష్టి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం విస్మరించి సిద్ధాంతాలు లేని రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే గెలవాలని ప్రయత్నించడం, దీనికోసం ఏకంగా రూ.280 కోట్లు ఖర్చుపెట్టడం ధన రాజకీయానికి నిదర్శనమని తెలిపారు. అనంతరం ఈ చర్చాగోష్టిలో పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. అంబేడ్కర్ ఆశించిన ప్రజాస్వామ్యం లేదని మాజీ వీసీ ప్రొఫెసర్ కె. వెంకటరెడ్డి అన్నారు. నాయకుల గుప్పెట్లో ప్రజాస్వామ్యం బందీ అయ్యిందని ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ఎ.రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష నాయకులు సైతం ఫిరాయింపులకు పాల్పడడం దుర్మార్గమని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ అన్నారు. ప్రజాస్వామ్యం ధనిక స్వామ్యంగా మారిందని సీనియర్ పాత్రికేయులు రాఘవశర్మ అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుదారులు తిరిగి ఎన్నిక కాకుండా అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘాలని కల్పించాలని అకాడమీ ఆఫ్ గ్రాస్ రూట్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా డెరైక్టర్ డాక్టర్ డి. సుందరరామ్ అన్నారు. ఈ చర్చాగోష్టిలో పెద్దఎత్తున ప్రజలు, నాయకులు, పాత్రికేయులు, వివిధ సంఘాల నాయకులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు పాల్గొన్నారు. -
‘బీజేపీలో దళితులకు స్వేచ్ఛ లేదు’
తెనాలి (గుంటూరు జిల్లా) : బిజెపిలో ఆ పార్టీ దళిత ఎంపీలకు స్వేచ్చ లేదని, దేశవ్యాప్తంగా ఆ పార్టీలో 46 మంది దళిత ఎంపీలు ఉంటే ఒక్కరికి కూడా కేబినెట్ మంత్రి పదవి ఇవ్వలేదని ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం తెనాలి నియోజకవర్గ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ సంస్థల చేతుల్లో నడుస్తుందన్నారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయని, విశ్వవిద్యాలయాల్లో కుల,మత ఘర్షణలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో అరాచక, దోపిడీ పాలన జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని మహిళలను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతుందని, కాంట్రాక్టర్లు, సొంత మనుషులకు ప్రజాప్రతినిధులు పనులు చేస్తూ ప్రజలకు పనులు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు మనోదైర్యం కలిగించే విధంగా పరిపాలన చేయాలని, సమాజంలో అసమానతలు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్రమోదీ మోసగాడని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిరికివాడని అభివర్ణించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకిగా పనిచేస్తున్నారని, దళితుల ఓట్లుతో అధికారంలోని వచ్చి వారిని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. -
మాజీ స్పీకర్ విగ్రహం ధ్వంసం
కరీంనగర్(కాటారం): ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాటారం మండలంలోని బస్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన ఆయన కుమారుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే విగ్రహాన్ని ఇంతకు ముందు కూడా ఒకసారి ధ్వంసం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటి ఘటనలో స్పీకర్ విగ్రహం చేయి కూడా విరిగింది. అయితే ఈ పని ఎవరు చేశారు అనే విషయం ఇంకా తెలియరాలేదు.