సాక్షి, హైదరాబాద్: నగరంలో రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు త్వరగతిన ఈ కేసులో పురోగతి సాధించారు. హత్య కేసులో కీలక నిందితుడు త్రిలోక్‌నాథ్ బాబాను మహరాష్ట్రలో సైబరాబాద్ పోలీసుల అదుపులో తీసుకున్నారు. ఆయనతోపాటు మరో నిందితుడు కార్తీక్‌ని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భాస్కర్‌రెడ్డి హత్యకు ముందు అతను తిన్న ఆహారంలో కార్తీక్ మత్తు మందు కలిపినట్లు దర్యాప్తులో తేలింది.
నలుగురు నిందితులు మల్లేష్, సుధాకర్.. కృష్ణంరాజు, ఆర్‌ఎమ్‌పీ డాక్టర్‌ను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్ టు శ్రీశైలం సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. సీసీ ఫుటేజ్, కాల్ సీడీఆర్ ఆధారంగా ఈ హత్యలో ఇతరుల పాత్రపై కూడా విచారణ జరపనున్నారు. గుప్తనిధులు, రియల్ ఎస్టేట్ గొడవలపై కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అంతా ప్లాన్ ప్రకారమే..
కాగా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి విజయ్‌భాస్కర్ రెడ్డి గత నెల కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ప్లాన్ ప్రకారం అతనికి ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా విజయ్‌భాస్కర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment