![Bill Gates Comments on Apple Steve Jobs - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/9/bill-gates.jpg.webp?itok=rvjdCcim)
వాషింగ్టన్: ప్రత్యర్థి సంస్థ యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ సారథ్య నైపుణ్యాలపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపి, సుదీర్ఘంగా గంటల కొద్దీ పనిచేసేలా మాయ చేయడంలో జాబ్స్ ఆరితేరిన వ్యక్తని కితాబిచ్చారు. అథఃపాతాళంలోకి జారిపోతున్న యాపిల్‌ను మళ్లీ నిలబెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిపిన జాబ్స్ 2011లో క్యాన్సర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ‘అతను మాట్లాడుతుంటే అందరూ మంత్ర ముగ్ధులైపోవడం నేను చూశాను. అయితే, నేను కూడా ఒక చిన్న పాటి మంత్రగాణ్ని కావడంతో ఆయన మాయలు, మంత్రాలేవీ నా మీద ప్రభావం చూపేవి కావు‘ అని ఒక ఇంటర్వ్యూలో గేట్స్ పేర్కొన్నారు. టాలెంట్‌ను గుర్తించడంలోను, వారిలో స్ఫూర్తి నింపడంలోనూ జాబ్స్‌ను మించినవారెవరూ ఇప్పటిదాకా తనకు కనిపించలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment