స్టీవ్ జాబ్స్ కూడా ఓ శరణార్థే! | Banksy's Steve Jobs mural spotlights refugee crisis | Sakshi
Sakshi News home page

స్టీవ్ జాబ్స్ కూడా ఓ శరణార్థే!

Published Mon, Dec 14 2015 4:43 PM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

స్టీవ్ జాబ్స్ కూడా ఓ శరణార్థే!

స్టీవ్ జాబ్స్ కూడా ఓ శరణార్థే!

ప్రముఖ బ్రిటన్ గ్రాఫిటీ చిత్రకారుడు బాన్క్సీ వేసిన ఓ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల సమస్యను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. ఉత్తర ఫ్రాన్స్ కలైస్ పట్టణంలోని శరణార్ధుల శిబిరం వద్ద యాపిల్ సంస్థ స్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ చిత్రాన్ని బాన్క్సీ గోడపై వేశాడు. ఈ చిత్రంలో స్టీవ్ జాబ్స్ పాతకాలపు యాపిల్ కంప్యూటర్ను చేతిలో పట్టుకొని భుజాన నల్లని బ్యాగు వేసుకొని ఉన్నాడు.

ఇటీవల అనేక దేశాలు.. శరణార్థుల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామనే  భావిస్తున్నాయి. దీనిని తప్పుపడుతూ బాన్క్సీ ఈ చిత్రాన్ని వేశాడు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం స్టీవ్ జాబ్స్ కూడా సిరియా నుంచి ఒక శరణార్థి లాగే అమెరికాలోకి ప్రవేశించాడని, జాబ్స్ ద్వారా ఆ దేశానికి ఆర్ధికంగా మేలే జరిగింది అనే విషయాన్ని బాన్క్సీ వెల్లడించాడు. 'ది జంగిల్' అనే శరణార్థుల శిబిరం వద్ద ఈ చిత్రాన్ని గమనించిన అధికారులు.. దీనిని అమూల్యమైన సంపదగా భావించి సంరక్షిస్తామని తెలిపారు.

అలాగే ధ్వంసమైన పడవలో అవస్థలు పడుతున్న శరణార్థులు.. ఓ ఖరీదైన నౌక సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాన్ని సైతం బాన్క్సీ అద్భుతంగా ఆవిష్కరించి శరణార్థుల సమస్యలను కళ్లకు కట్టాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement