mural
-
ఉక్రెయిన్-రష్యా సైనికుల కౌగిలింత.. తీవ్ర విమర్శలు
వైరల్: సద్దుదేశంతో ఓ ఆర్టిస్ట్ గీసిన చిత్రం.. తీవ్ర దుమారం రేపింది. ప్రధానంగా బాధిత దేశం నుంచి అభ్యంతరాలు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ ఆర్ట్ వర్క్‌ను ఎట్టకేలకు తొలగించాల్సి వచ్చింది. ఉక్రెయిన్-రష్యా సైనికులు కౌగిలించుకున్నట్లు ఓ కుడ్యచిత్రంను(మ్యూరాల్) మెల్బోర్న్(ఆస్ట్రేలియా)నగరంలో ప్రదర్శించారు. పీటర సీటన్ అనే ఆర్టిస్ట్.. ఇరు దేశాల మధ్య శాంతియుత ప్రయత్నాలను ప్రతిబింబించేలా ఒకరాత్రంతా కష్టపడి దానిని వేశాడు. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఉక్రెయిన్ రాయబారి వసైల్ మైరోష్నిచెంకో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై వ్లాదిమిర్ పుతిన్ పూర్తి స్థాయి దండయాత్ర వాస్తవికతను వక్రీకరించే ప్రయత్నమంటూ మండిపడ్డారాయన. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే అంశమే. అది గీసిన ఆర్టిస్ట్‌కు బహుశా రష్యా ఆక్రమణ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయి ఉండొచ్చు. రష్యాను శాంతికాముక దేశంగా చిత్రీకరించే యత్నం చేయడం దుర్మార్గం. వేలమందిని బలిగొన్న ఈ మారణహోమంపై ఇలాంటి చిత్రం.. కలలో కూడా ఈ ఊహ సరికాదు. ఉక్రెయిన్ కమ్యూనిటీ సంప్రదించకుండా దానిని ప్రదర్శించడం విచారకరం అంటూ ట్విటర్లో షేర్ చేశారాయన. వీలైనంత త్వరగా దానిని తొలగించాలని డిమాండ్ చేశారాయన. మరోవైపు ప్రముఖ సోషియాలజిస్ట్ ఓల్గా బోయ్చక్ ఈ వ్యవహారంపై మండిపడ్డారు. నిందితుడిని-బాధితుడిని ఒకేలా చూపించే ప్రయత్నం సరికాదని, దీని వెనుక ఏదైనా గూఢపుఠాణి ఉండొచన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవైపు ఆ ఆర్ట్‌వర్క్‌కు పాజిటివ్ కామెంట్లు, లైకులు దక్కినప్పటికీ.. విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో దానిని తొలగించారు సీటన్. అంతేకాదు.. దీనిని నెగెటివ్‌గా తీసుకుంటారని తాను అనుకోలేదని చెబుతూ.. క్షమాపణలు తెలియజేశారు. ఇదీ చదవండి: కత్తి దూసిన ఉన్మాదం.. పదిమంది దారుణహత్య -
లాక్డౌన్లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!
మనం చాలా రకాలుగా చిత్రాలను గీయడం చూశాం. కానీ జుట్టుతో చిత్రాలను రూపొందించడం తెలుసా? అది కూడా యూకే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చిత్రాన్ని రూపొందించింది. అసలు ఎవరు ఈ చిత్రాన్ని రూపొందించారు ఎక్కడ ఏంటో చూద్దాం రండి. (చదవండి: ప్లీజ్ అంకుల్ నన్ను కూడా టెస్ట్ చేయండి) వివరాల్లోకెళ్లితే.....కోవిడ్ 19 విపత్కర సమయాల్లో తనదైన వ్యూహంతో దేశాన్ని సమర్ధవంతంగా నడిపించిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కృతజ్ఞతలు తెలిపే నిమిత్తం డేవినియా ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ మేరకు సోమర్సెట్లో సెలూన్‌ను నడుపుతున్న డావినియా సెలూన్లో సేకరించిన జుట్టు వ్యర్థాలతో 5 అడుగుల బోరిస్ జాన్సన్ చిత్రాన్ని రూపొందించింది. అయితే ఆమె ఈ పనిని కేవలం రెండు రోజుల్లో పూర్తి చేసింది. ఈ మేరకు డేవినియా మాట్లాడుతూ.... లాక్డౌన్లలో ప్రజల జుట్టు ఎంత పెరిగిందో చెప్పేందుకు ఈ చిత్రం ఒకరకరంగా దోహదపడుతుంది. అంతేకాదు ఈ లాక్డౌన్ వేళ సెలున్ల ప్రాముఖ్యతను ప్రజలందరు గుర్తించారు. ఈ కుడ్యచిత్రాన్ని బోరిస్ వ్యక్తిగతంగా వీక్షించాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది. (చదవండి: కుక్కతో చిరుత స్నేహం.. వీడియో వైరల్) -
స్టీవ్ జాబ్స్ కూడా ఓ శరణార్థే!
ప్రముఖ బ్రిటన్ గ్రాఫిటీ చిత్రకారుడు బాన్క్సీ వేసిన ఓ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల సమస్యను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. ఉత్తర ఫ్రాన్స్ కలైస్ పట్టణంలోని శరణార్ధుల శిబిరం వద్ద యాపిల్ సంస్థ స్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ చిత్రాన్ని బాన్క్సీ గోడపై వేశాడు. ఈ చిత్రంలో స్టీవ్ జాబ్స్ పాతకాలపు యాపిల్ కంప్యూటర్ను చేతిలో పట్టుకొని భుజాన నల్లని బ్యాగు వేసుకొని ఉన్నాడు. ఇటీవల అనేక దేశాలు.. శరణార్థుల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామనే భావిస్తున్నాయి. దీనిని తప్పుపడుతూ బాన్క్సీ ఈ చిత్రాన్ని వేశాడు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం స్టీవ్ జాబ్స్ కూడా సిరియా నుంచి ఒక శరణార్థి లాగే అమెరికాలోకి ప్రవేశించాడని, జాబ్స్ ద్వారా ఆ దేశానికి ఆర్ధికంగా మేలే జరిగింది అనే విషయాన్ని బాన్క్సీ వెల్లడించాడు. 'ది జంగిల్' అనే శరణార్థుల శిబిరం వద్ద ఈ చిత్రాన్ని గమనించిన అధికారులు.. దీనిని అమూల్యమైన సంపదగా భావించి సంరక్షిస్తామని తెలిపారు. అలాగే ధ్వంసమైన పడవలో అవస్థలు పడుతున్న శరణార్థులు.. ఓ ఖరీదైన నౌక సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాన్ని సైతం బాన్క్సీ అద్భుతంగా ఆవిష్కరించి శరణార్థుల సమస్యలను కళ్లకు కట్టాడు.