మనం చాలా రకాలుగా చిత్రాలను గీయడం చూశాం. కానీ జుట్టుతో చిత్రాలను రూపొందించడం తెలుసా? అది కూడా యూకే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చిత్రాన్ని రూపొందించింది. అసలు ఎవరు ఈ చిత్రాన్ని రూపొందించారు ఎక్కడ ఏంటో చూద్దాం రండి.
(చదవండి: ప్లీజ్ అంకుల్ నన్ను కూడా టెస్ట్ చేయండి)
వివరాల్లోకెళ్లితే.....కోవిడ్ 19 విపత్కర సమయాల్లో తనదైన వ్యూహంతో దేశాన్ని సమర్ధవంతంగా నడిపించిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కృతజ్ఞతలు తెలిపే నిమిత్తం డేవినియా ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ మేరకు సోమర్‌సెట్‌లో సెలూన్‌ను నడుపుతున్న డావినియా సెలూన్‌లో సేకరించిన జుట్టు వ్యర్థాలతో 5 అడుగుల బోరిస్ జాన్సన్ చిత్రాన్ని రూపొందించింది.
అయితే ఆమె ఈ పనిని కేవలం రెండు రోజుల్లో పూర్తి చేసింది. ఈ మేరకు డేవినియా మాట్లాడుతూ.... లాక్‌డౌన్‌లలో ప్రజల జుట్టు ఎంత పెరిగిందో చెప్పేందుకు ఈ చిత్రం ఒకరకరంగా దోహదపడుతుంది. అంతేకాదు ఈ లాక్‌డౌన్ వేళ సెలున్‌ల ప్రాముఖ్యతను ప్రజలందరు గుర్తించారు. ఈ కుడ్యచిత్రాన్ని బోరిస్ వ్యక్తిగతంగా వీక్షించాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది.
(చదవండి: కుక్కతో చిరుత స్నేహం.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment