
ఆపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ నాలుగు దశాబ్దాల క్రితం ఉద్యోగానికి చేసుకున్న దరఖాస్తు ఒకటి వేలానికి రాబోతుంది. దీని ధర 50,000 డాలర్లు పలుకుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో ఇది సుమారు రూ.32 లక్షలు. ఈ దరఖాస్తు 1973 నాటిదని తెలుస్తోంది. పేరు స్టీవ్ జాబ్స్ అని, రీడ్ కాలేజీ అడ్రస్‌తో ఈ అప్లికేషన్ ఉంది.
బోస్టన్ కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్ దీన్ని వేలానికి ఉంచుతోంది. మార్చి 8 నుంచి 15 మధ్యలో ఈ వేలం నిర్వహించనుంది. అయితే, ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నది ఈ అప్లికేషన్‌లో లేదు. ప్రత్యేక నైపుణ్యాల సెక్షన్ కింద స్టీవ్ జాబ్స్, టెక్ లేదా డిజైన్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. మూడేళ్ల అనంతరం స్టీవ్ జాబ్స్, అతని మిత్రుడు స్టీవ్ వొజ్నాయిక్ ఆపిల్ కంపెనీని స్థాపించారు. స్టీవ్ జాబ్స్ కేన్సర్ కారణంగా 2011లో 56 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవలే ఆపిల్, స్టీవ్ జాబ్స్ పేరుతో ఉన్న ఇటాలియన్ క్లోతింగ్ కంపెనీకి వ్యతిరేకంగా సాగించిన న్యాయపోరాటంలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment