టెక్ దిగ్గజం ఆపిల్ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు వినియోగించిన బీఎండబ్ల్యూ జెడ్8 లగ్జరీ కారు మరోసారి వేలానికి వస్తోంది. ఈ కారును వేలం వేయనున్నట్లు ఆర్‌ఎం సోథిబే వేలం సంస్థ ప్రకటించింది. వేలంలో ఈ కారు 3 లక్షల డాలర్ల నుంచి 4 లక్షల డాలర్ల వరకు పలికే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కారు అసలు ధర 1,28,000 డాలర్లు. డిసెంబర్‌లో న్యూయార్క్‌లో ఈ కారును వేలం వేయనున్నారు. ఈ కారును ప్రస్తుతం అంత అద్భుతమైనది కానప్పటికీ, ఐకానిక్ మోడల్‌గా నిలుస్తోంది. ఈ మోడల్ కారును జేమ్స్ బాండ్ మూవీలో యాక్టర్ పియర్స్ బ్రాస్నన్ కూడా వాడారు.
స్టీవ్ 2000 అక్టోబరులో దీన్ని కొనుగోలు చేశారని.. 2003 వరకు వినియోగించారని సోథిబే సంస్థ తెలిపింది. దీన్ని తొలుత కొనుగోలు చేసినప్పటి నుంచి ఏడాదికి 1000 మైళ్ల కంటే తక్కువే ప్రయాణించింది. మూడేళ్ల పాటు ఈ కారును తన వద్దనే ఉంచుకున్న స్టీవ్ జాబ్స్ అనంతరం లాస్ ఏంజిలెస్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. ప్రస్తుతం ఈ కారు మరోసారి అమ్మకానికి వస్తోంది. ఒరాకిల్ సంస్థ సీఈవో లారీ ఎల్లిసన్ ఈ కారును కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. బీఎండబ్ల్యూ జెడ్8 1999, 2003 మధ్య కాలంలో తయారు చేశారు. ఈ మోడల్ ముందు భాగం అంత ఆకర్షణీయంగా లేనప్పటికీ, డిజైన్ ఐకానిక్‌గా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment