స్టీవ్ జాబ్స్ బ్రతికే ఉన్నాడా?
బ్రెజిల్:ఆపిల్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ బ్రతికే ఉన్నాడా? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఇది. బ్రెజిల్ లో స్టీవ్ జాబ్స్ బ్రతికే ఉన్నాడని వార్తలతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2011 అక్టోబర్‌లో కేన్సర్‌తో చనిపోయిన స్టీవ్ జాబ్స్ బ్రతికే ఉన్నాడనే ఊహాగానాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అందుకు కారణం స్టీవ్ సజీవంగానే ఉన్నాడనే సెల్ఫీ ఫోటోనే. బ్రెజిల్ లోని ఒక నగరంలో స్టీవ్ నివసిస్తున్నాడనేది ఆ ఫోటో సారాంశం. వీల్ చైర్ లో దర్శనమిచ్చిన ఆ ఫోటోలోని వ్యక్తి స్టీవ్ జాబ్స్ ను పోలి ఉండటం కాస్తా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ ఫోటో క్రింద 'స్టీవ్ జాబ్స్ ఇజ్ ఇన్ రియో డి జనిరియో' అనే ఒక క్యాప్షన్ కూడా ఉంది.
గత మూడు సంవత్సరాల క్రితం ఆయన చనిపోయే సమయానికి జీవిత చరిత్ర ‘స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకం కూడా వెలువడింది. దీనికి గ్రంథకర్త వాల్టర్ ఐజాక్సన్. జాబ్స్‌తో ఐజాక్సన్‌కి చాలా సాన్నిహిత్యం ఉండేదట. రెండేళ్ల వ్యవధిలో దాదాపు నలభైసార్లు జాబ్స్‌ని ఇంటర్వ్యూ చేశారు ఐజాక్సన్. జాబ్స్ ఎక్కడా దేవుడి గురించి మాట్లాడలేదు. ఓసారి మాత్రం ఆ సందర్భం వచ్చింది. మాటల మధ్యలో - ‘‘దేవుణ్ణి మీరు విశ్వసిస్తారా?’’ అని అడిగారు ఐజాక్సన్. ‘‘ఏమో చెప్పలేను ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అన్నారు జాబ్స్. ‘‘కానీ ఒకటనిపిస్తోంది. ఈ జన్మలో మనం సంపాదించిన జ్ఞానం, పోగేసుకున్న వివేకం మన మరణం తర్వాత ఎలాగో కొనసాగుతాయని’’ అన్నారు. కొన్ని క్షణాల మౌనం తర్వాత మళ్లీ అన్నారు. ‘‘ఈ జనన మరణాలన్నవి ఆన్-ఆఫ్ లాంటివి అనిపిస్తుంది. ఆఫ్ క్లిక్ చేస్తే ఇక అంతే. అయిపోయినట్లు. ముగిసినట్లు. ఆపిల్ పరికరాలకు కూడా ఆన్-ఆఫ్ స్విచ్ పెట్టడం నాకు ఇష్టముండేది కాదు’’ అని చెప్పారని ఐజాక్స్ వెల్లడించారు.