వేలానికి స్టీవ్ జాబ్స్ తయారీ ఆపిల్ కంప్యూటర్ | Apple computer hand-built by Steve Jobs to be auctioned | Sakshi
Sakshi News home page

వేలానికి స్టీవ్ జాబ్స్ తయారీ ఆపిల్ కంప్యూటర్

Published Mon, Sep 7 2015 9:59 AM | Last Updated on Mon, Aug 20 2018 2:58 PM

వేలానికి స్టీవ్ జాబ్స్ తయారీ ఆపిల్ కంప్యూటర్ - Sakshi

వేలానికి స్టీవ్ జాబ్స్ తయారీ ఆపిల్ కంప్యూటర్

న్యూయార్క్: 40 ఏళ్ల నాటి ఆపిల్ తొలితరం కంప్యూటర్ ఒకటి వేలానికి రానుంది. 1977లో ఆపిల్ సంస్థ మాజీ సీఈఓ స్టీవ్‌ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్‌తో కలిసిదీన్ని స్వయంగా చేతితో తయారుచేసింది కావడం విశేషం. ఇది దాదాపు 3,30,000 పౌండ్ల ధర (దాదాపు రూ.3.3 కోట్లపైమాటే) పలకనుందని అంచనా వేస్తున్నారు.

ఆపిల్-1 మదర్ బోర్డు వినియోగించిన ఈ తొలితరం కంప్యూటర్‌ను వాస్తవానికి బైట్‌షాప్ 437 పౌండ్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇది చక్కగానే పనిచేస్తుండటం విశేషం. దీన్ని ఈనెల 21న బన్‌హామ్స్‌లో వేలం వేయనున్నారు. ప్రారంభ ధర 3,30,000 పౌండ్లుగా నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement