‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్‌ కుక్‌ | Tim Cook Said Eve Jobs Was Right When She Posted A Meme Iphone 14 | Sakshi
Sakshi News home page

‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్‌ కుక్‌

Published Sun, Oct 2 2022 5:26 PM | Last Updated on Sun, Oct 2 2022 9:37 PM

Tim Cook Said Eve Jobs Was Right When She Posted A Meme Iphone 14 - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌.. ఐఫోన్‌ 14 సిరీస్‌తో పాటు సిరీస్‌ 8, ఎయిర్‌పాడ్స్‌ ప్రో, వాచీ ఎస్‌ఈ2లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐఫోన్‌ 14 సిరీస్‌పై యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్‌ సిరీస్‌ ఫోన్‌లపై యాపిల్​ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్​ జాబ్స్ కుమార్తె ఈవ్​ జాబ్స్​ వేసిన మీమ్స్‌ సమర్ధించారు. 

'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్' జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్‌ చేయగా.. వాటిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫోన్‌లలో ఎలాంటి ఆవిష్కరణలు లేవనే విమర్శలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

చదవండి👉 ఐఫోన్‌ కోసం దుబాయ్‌ వెళ్లాడు..కానీ చివరికి

ఈ క్రమంలో ఐఫోన్‌ 14 సిరీస్‌పై టిమ్‌కుక్‌ స్పందించారు. గత పదేళ్లుగా యాపిల్‌ కస్టమర్లలో నేను ఒకరిని.  తొలిసారి బ్లాక్‌ బెర్రీ నుంచి ఐఫోన్‌ 4ఎస్‌కు షిఫ్ట్‌ అయ్యా. నాటి నుంచి మార్కెట్‌లో ఏ ఐఫోన్‌ వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తుంటా. ఈ ఏడాది కూడా 256 జీబీ సిల్వర్‌ కలర్‌ ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ను కొనుగోలు చేశా. 

ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ను ఉద్దేశిస్తూ..‘‘నా కొత్త బొమ్మతో రెండు వారాల పాటు ఆడిన తరువాత, "డైనమిక్ ఐలాండ్" తప్ప.. ఆశ్చర్యపోయేలా ఆవిష్కణలు లేవని గట్టి నమ్మకంతో చెప్పగలను. సెల్ఫీ కెమెరా, నోటిఫికేషన్లు, అలెర్ట్స్‌, ఇతర కార్యకలాపాల్ని అనుసంధానం చేసేలా ఫేస్ ఐడి సెన్సార్ మాత్రమే ఉందని అన్నారు.  

స్టీవ్ జాబ్స్ కూతురు చెప్పింది నిజమే
స్టీవ్ జాబ్స్ కూతురు ఈవ్ జాబ్స్ కొత్త ఐఫోన్ 14 సిరీస్‌పై సెటైర్ వేశారు. పాత స్మార్ట్‌ఫోన్ల లాగానే కొత్త జనరేషన్ ఫోన్‌లు ఉన్నాయని అర్ధం వచ్చే ఓ మీమ్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కి అప్‌గ్రేడ్ అవుతున్నానని..ఓ వ్యక్తి తాను వేసుకున్న షర్ట్ లాంటిదే మరో షర్ట్ చేతిలో పట్టుకొని ఉన్న మీమ్‌ను ఈవ్‌ జాబ్స్‌ షేర్‌ చేసింది. ఆ మీమ్‌నే టిమ్‌ కుక్‌ సమర్ధించారు.

చదవండి👉 ఐఫోన్‌ కోసం దుబాయ్‌ వెళ్లాడు..కానీ చివరికి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement