వెస్ట్‌ల్యాండ్ మాల్‌లో 50% వాటా
బ్లాక్‌స్టోన్ చేతికి
ముంబై: ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్... పుణేలోని వెస్ట్‌ల్యాండ్ మాల్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను ఎంతకు కొనుగోలు చేసిందీ మాత్రం వెల్లడించలేదు. ఇది బ్లాక్‌స్టోన్ సంస్థ వాటాకొనుగోలు చేసిన నాలుగో మాల్ అని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జోన్స్ లాంగ్ లాసల్లె తెలియజేసింది. డీల్ సాకారం కావడానికి ఈ సంస్థే సహకరించింది. పశ్చిమ పుణేలో ఇదే అతిపెద్ద రిటైల్‌మాల్ అని జేఎల్‌ఎల్ ఇండియా ఎండీ (పుణే) సంజయ్ బజాజ్ చెప్పారు.
ఇప్పటికే బ్లాక్‌స్టోన్ సంస్థ అహ్మదాబాద్, అమృత్‌సర్, నవీ ముంబైల్లోని రిటైల్ మాల్స్‌ల్లో వాటాలను కొనుగోలు చేసింది. బ్లాక్‌స్టోన్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద రియల్‌ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థగా పేర్కొన్నారాయన. రియల్టీ రంగంలో వివిధ సమస్యలున్నప్పటికీ, సంస్థాగత రియల్టీ ఇన్వెస్టర్లు భారీ స్థాయి అవకాశాలను వదులుకోరనే విషయాన్ని ఈ డీల్ నిరూపిస్తోందని బజాజ్‌తెలియజేశారు.