
చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు తమ మనమ సంతానానికి కథలు చెప్పాలంటే ‘అనగనగా ఓ రాజకుమారుడు’ ఉండేవాడట అని ప్రారంభించేవారు. ఇప్పుడు అదే టైటిల్‌తో రామ్ సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై పి.వి. రాఘవులు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా రాజకుమారుడు’. నవీన్ బాబు, సంజన జంటగా నటిస్తున్నారు. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాటలను తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి సంస్థ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు విడుదల చేశారు.
షేర్ మాట్లాడుతూ– ‘‘చిన్న మెసేజ్‌తో పాటు యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మా చిత్రం ఉంటుంది. హీరో హీరోయిన్లు చక్కగా నటించడంతో పాటు రాఘవులుగారు రాజీ పడక పోవడంతో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘నేటి యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమాను తీశాం. దర్శకుడు చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు రాఘవులు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment