
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), మ్యూచువల్ ఫండ్లు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో స్వల్పంగా వాటాలు పెంచుకున్నాయి. స్టాక్ ఎక్ఛేంజీ కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఎఫ్‌పీఐల సంఖ్య మార్చి త్రైమాసికంలో 54గా ఉండగా జూన్ క్వార్టర్‌లో 83కి పెరిగింది. వారి దగ్గరున్న షేర్ల సంఖ్య 2,86,80,948 నుంచి 3,53,72,428కి చేరింది.
దీంతో సంస్థలో ఎఫ్‌పీఐల వాటా 4.42 శాతం నుంచి 5.45 శాతానికి పెరిగింది. మరోవైపు, ఇదే వ్యవధిలో మ్యుచువల్ ఫండ్స్ సంఖ్య కూడా 3 నుంచి 19కి చేరింది. వాటి దగ్గరున్న షేర్ల సంఖ్య 68,19,790 నుంచి 74,02,309కి పెరిగింది. జూన్ త్రైమాసికంలో పేటీఎం షేరు 18 శాతం పెరిగి రూ. 675కి చేరింది. ప్రస్తుతం గురువారం బీఎస్‌ఈలో రూ. 745 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment