
1.2 బిలియన్ డాలర్లకు దేశీ డిజిటల్ క్లాసిఫైడ్ పరిశ్రమ!
దేశీ డిజిటల్ క్లాసిఫైడ్ పరిశ్రమ 2020 నాటికి మూడు రెట్లు వృద్ధితో 1.2 బిలియన్ డాలర్లకి చేరుతుందని గూగుల్-కేపీఎంజీ సంయుక్త నివేదిక పేర్కొంటోంది.
హైదరాబాద్: దేశీ డిజిటల్ క్లాసిఫైడ్ పరిశ్రమ 2020 నాటికి మూడు రెట్లు వృద్ధితో 1.2 బిలియన్ డాలర్లకి చేరుతుందని గూగుల్-కేపీఎంజీ సంయుక్త నివేదిక పేర్కొంటోంది. డిజిటల్ క్లాసిఫైడ్స్ వృద్ధిలో ఇ-సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్ వంటి వెర్టికల్ క్లాసిఫైడ్ విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. ఇక ఇ-సర్వీసెస్, రియల్ ఎస్టేట్ క్లాసిఫైడ్స్‌లో 2020 నాటికి వరుసగా ఏడు రెట్లు, నాలుగు రెట్లు వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. మొత్తం డిజిటల్ క్లాసిఫైడ్స్‌లో 30% వాటాతో హారిజాంటల్ క్లాసిఫైడ్స్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయని పేర్కొంది.
63 శాతం మంది వినియోగదారులు ఇ-క్లాసిఫైడ్స్‌ను యాక్సెస్ చేయనుండటంతో 2020కి ఆన్‌లైన్ జాబ్ మార్కెట్ రెట్టింపు అవుతుందని తెలిపింది. ఆన్‌లైన్ జాబ్ సెర్చ్‌లో బెంగళూరు, ముంబై, ఎన్‌సీఆర్, హైదరాబాద్‌లు అగ్రస్థానాల్లో నిలిచాయని పేర్కొంది.