న్యూఢిల్లీ: టెక్నికల్ టెక్స్‌టైల్ తయారీ కంపెనీ శ్రీ టెక్‌టెక్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 26న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 54–61గా నిర్ణయించింది. 28న ముగియనున్న ఇష్యూలో భాగంగా 74 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది.
తద్వారా రూ. 45 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(25న) షేర్లను కేటాయించనుంది. చిన్నతరహా కంపెనీల కోసం ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ షేర్లు లిస్ట్‌కానున్నాయి.
ఇష్యూ నిధులను ఫ్యాక్టరీ షెడ్ నిర్మాణం, సోలార్ ప్లాంటు ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా పీపీ నాన్‌ఒవెన్ ఫ్యాబ్రిక్‌ను వివిధ పరిమాణాల్లో తయారు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment