
టీవీఎస్ లాజిస్టిక్స్ చేతికి యూకే కంపెనీ
డీల్ విలువ రూ.165 కోట్లు
చెన్నై: టీవీఎస్ గ్రూప్‌కు చెందిన టీవీఎస్ లాజిస్టిక్స్ ఇంగ్లండ్‌కు చెందిన ఒక కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన ఎస్‌పీసీ ఇంటర్నేషనల్‌లో మెజారిటీ వాటాను టీవీఎస్ లాజిస్టిక్స్‌కు చెందిన ఇంగ్లండ్ అనుబంధ కంపెనీ టీవీఎస్ రికో సప్లై చెయిన్ సర్వీసెస్ చేజిక్కించుకుంది.
దీని కోసం రూ.165 కోట్లు వెచ్చించామని టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఎండీ, ఆర్. దినేశ్ చెప్పారు. ఎస్‌పీసీ ఇంటర్నేషనల్ కంపెనీ ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్లోవేకియా, అమెరికా, భారత్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మొత్తం 350 మంది ఉద్యోగులున్నారు. సాంకేతికంగా, అంతర్జాతీయంగా మంచి సేవలందిస్తున్న కంపెనీలను కొనుగోలు చేయడంలో భాగంగా ఎప్‌పీసీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నామని వివరించారు.