సాక్షి, ముంబై : వివాదాల సంక్షోభం, మూలధన సమస్యల్లో ఇరుక్కున్న ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలతో అటు ఇన్వెస్టర్లను, ఇటు ట్రేడర్లను ఆశ్చర్య పర్చింది. దీంతో గురువారం నాటి నష్టాల మార్కెట్లో బ్యాంకు షేరు లాభాలతో దూసుకపోతోంది. రూ .2,629 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంతో యస్ బ్యాంకు షేర్లు నష్టాల మార్కెట్లో భారీగా లాభపడుతున్నాయి. రూ. 31.60 వద్ద షేర్ ధర ఈరోజు 20 శాతం పుంజుకుంది. ఎన్‌ఎస్‌ఇ, బీఎస్‌ఇలలో 39.39 మిలియన్ షేర్లు చేతులు మారాయి. (నష్టాల్లో మార్కెట్ : యస్ బ్యాంకు జంప్)
ఎస్ బ్యాంకు పునరుద్ధరణలో ఆర్‌బీఐ గైడెడ్ బెయిలౌట్ సహాయంతో ఇప్పుడు కోలుకుంటున్ బ్యాంకు, ఈ పరిణామాల తరువాత తన మొదటి ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోరూ. 18,560 కోట్ల నష్టాన్ని, జనవరి-మార్చి త్రైమాసికంలో రూ .1,506 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం దాదాపు సగం తగ్గి రూ.1,274 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.16,418 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువ జారడం వల్ల వరుసగా 19.6 శాతం వృద్ధి. రూ .32,878 కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులను (స్థూల ఎన్‌పిఎ), నికర నిరర్ధక ఆస్తులను (నెట్ ఎన్‌పిఎ) 862,37 కోట్ల రూపాయలుగా నివేదించింది. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం ప్రొవిజన్లు రూ .24,766 కోట్లతో పోలిస్తే రూ .4,872 కోట్లకు తగ్గాయి. చాలా మంది విశ్లేషకులు ఊ హించిన దాని కంటే ఆదాయాలు మెరుగ్గా ఉండం విశేషం. కోటక్ సెక్యూరిటీస్ రూ .4,404 కోట్ల నికర నష్టాన్ని అంచనా వేసింది, (యస్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ 60 వేల కోట్లు)
యస్ బ్యాంకు వివాదంతో జోక్యం చేసుకున్న ఆర్‌బీఐ మారటోరియం, నగదు విత్‌డ్రాపై ఆంక్షలకు దిగింది. బోర్డును రద్దు చేసి, 30 రోజుల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఆ తరువాత బ్యాంకు బోర్డును పునరుద్ధరించిన అనంతరం 2020 మార్చి18 నుండి అన్ని బ్యాంకింగ్ సేవలను తిరిగి ప్రారంభించింది. అలాగే బ్యాంకు పునరుద్దరణ చర్యల్లో భాగంగా ఎస్ బీఐ, హెచ్డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ఏడు ప్రైవేట్ బ్యాంకుల నుండి 10,000 కోట్ల రూపాయల ఈక్విటీ మూలధనాన్ని సమీకరించిన సంగతి తెలిసిందే. (యస్‌పై మారటోరియం ఎత్తివేత)
Comments
Please login to add a commentAdd a comment