
కేజీ డీ6లో ‘నికో’ వాటా అమ్మకానికి..
ఆర్‌ఐఎల్ డీ6 బ్లాక్‌లో 10% వాటా
రెండోసారి విక్రయ ప్రయత్నం
న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని డీ6 బ్లాక్‌లో ఆర్‌ఐఎల్ భాగస్వామ్య కంపెనీ, కెనడాకు చెందిన నికో రీసోర్సెస్ తన వాటాను తాజాగా మరోసారి విక్రయానికి పెట్టింది. కేజీ డీ6లో ఆర్‌ఐఎల్ 60 శాతం వాటాతో నిర్వహణ కంపెనీగా ఉండగా... బ్రిటన్‌కు చెందిన బీపీ పీఎల్‌సీకి 30%, నికోకు 10% చొప్పున వాటాలు ఉన్నారుు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నికో రీసోర్సెస్ కేజీ డీ6 (కేజీ-డీడబ్ల్యూఎన్-98/3) బ్లాక్‌లో 10% వాటాలను విక్రరుుంచి, దాని ద్వారా వచ్చే నిధులతో 340 మిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.2,278 కోట్లు) రుణాలను తీర్చివేయాలని అనుకుంటున్నట్టు గతేడాది ఫ్రిబవరిలోనే తెలిపింది. వాటా విక్రయానికి 2015 ఏప్రిల్ 30వ తేదీని గడువుగా నిర్ణరుుంచగా, తర్వాత దాన్ని మే 31కి, సెప్టెంబర్ 15 వరకు పొడిగించినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో వాటాల విక్రయ ప్రతిపాదనను వారుుదా వేసింది.
ప్రభుత్వ జరిమానాతో సంక్లిష్టం..
కేజీ డీ6లో అభివృద్ధి చేయని క్షేత్రాల్లోని సహజ వాయువు నిల్వలకు ధర విషయంలో ఉన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో తమ వాటాల విక్రయ ప్రక్రియను తిరిగి చేపట్టామని నికో రీసోర్సెస్ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ ఎల్స్‌వర్త్ తెలి పారు. కానీ పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ బావుల నుంచి గ్యాస్ తోడివేసినందుకు 1.55 బిలియన్ డాలర్ల మేర జరిమానా చెల్లించాలన్న ప్రభుత్వ డిమాండ్‌తో వాటాల విక్రయం సంక్లిష్టంగా మారినట్టు ఎల్స్‌వర్త్ తెలిపారు.