బిర్లా సన్లైఫ్లో అదనపు వాటా విక్రయం పూర్తి | Sun Life Financial hikes stake to 49% in Birla Sun Life Insurance | Sakshi
Sakshi News home page

బిర్లా సన్లైఫ్లో అదనపు వాటా విక్రయం పూర్తి

Published Tue, Apr 12 2016 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

బిర్లా సన్లైఫ్లో అదనపు వాటా విక్రయం పూర్తి

బిర్లా సన్లైఫ్లో అదనపు వాటా విక్రయం పూర్తి

న్యూఢిల్లీ: బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో విదేశీ భాగస్వామి,  కెనడాకు చెందిన సన్‌లైఫ్ ఫైనాన్షియల్ సంస్థ వాటా 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. ఈ అదనపు 23 శాతం వాటా విక్రయాన్ని ఆదిత్య బిర్లా నువో సోమవారం పూర్తి చేసింది. ఈ అదనపు వాటాను తమ జాయింట్ వెంచర్ భాగస్వామి, కెనడాకు చెందిన సన్ లైఫ్ ఫైనాన్షియల్ సంస్థకు రూ.1,664 కోట్లకు విక్రయించడం పూర్తయిందని ఆదిత్య బిర్లా నువో(ఏబీఎన్‌ఎల్) బీఎస్‌ఈకి నివేదించింది. దీంతో బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ రూ.7,235 కోట్లుగా ఉంది.  వాటా విక్రయంతో తమ నికర రుణ భారం గణనీయంగా తగ్గుతుందని ఏబీఎన్‌ఎల్ పేర్కొంది.  డీల్ తర్వాత బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఆదిత్య బిర్లా నువోకు 51 శాతం, సన్ లైఫ్ ఫైనాన్షియల్‌కు 49 శాతం చొప్పున వాటాలుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement