టాటా మోటార్స్, కేస్ట్రాల్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం | We are taking 'Make in India' seriously: Tata Motors | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్, కేస్ట్రాల్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం

Published Fri, Jan 6 2017 1:28 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

టాటా మోటార్స్, కేస్ట్రాల్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం

టాటా మోటార్స్, కేస్ట్రాల్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘టాటా మోటార్స్‌’, ప్రముఖ గ్లోబల్‌ లూబ్రికెంట్‌ బ్రాండ్‌ ‘కేస్ట్రాల్‌’ మధ్య ఒక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. దీని ప్రకారం కేస్ట్రాల్‌ సంస్థ దాదాపు 50కిపైగా ప్రపంచ మార్కెట్లలో టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాలకు (కమర్షియల్‌ వెహికల్స్‌కి)కు మూడేళ్లపాటు ఆయిల్స్‌ను సరఫరా చేయనుంది.

‘కేస్ట్రాల్‌తో మాకు స్వదేశంలో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఈ సంస్థ మా కస్టమర్లకు మంచి ప్రొడక్ట్‌లను, అత్యున్నతమైన సేవలను అందిస్తోంది. మా భాగస్వామ్యాన్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం ఆనందంగా ఉంది’ అని టాటా మోటార్స్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గ్యున్‌టర్‌ బషెక్‌ తెలిపారు. టాటా మోటార్స్‌కి ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలందిస్తామని, కొత్త మార్కెట్లలో మద్దతునిస్తామని బీపీ లూబ్రికెంట్స్‌ సీఈవో మంధీర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement