ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటా విక్రయం! | Bharti Airtel may sell stake in Infratel via block deals | Sakshi
Sakshi News home page

ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటా విక్రయం!

Published Thu, Apr 21 2016 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటా విక్రయం!

ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటా విక్రయం!

బారతీ ఎయిర్‌టెల్ కంపెనీ తన టవర్ల విభాగమైన భారతీ ఇన్ ఫ్రాటెల్‌లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది.

న్యూఢిల్లీ: బారతీ ఎయిర్‌టెల్ కంపెనీ తన టవర్ల విభాగమైన భారతీ ఇన్ ఫ్రాటెల్‌లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ వాటా విక్రయంతో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్‌టెల్ యోచిస్తోందని సమాచారం. ఇన్‌ఫ్రాటెల్‌లో ఎయిర్‌టెల్‌కు 71.7 శాతం వాటా ఉంది.  ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో రుణ భారాన్ని తగ్గించుకోవాలని భారతీ ఎయిర్‌టెల్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాటా విక్రయ వార్తలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్రతినిధి నిరాకరించారు. కాగా గత ఏడాది డిసెంబర్ నాటికి ఎయిర్‌టెల్ నికర రుణభారం రూ.78,816 కోట్లుగా ఉంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రంగంలోకి వస్తుండటంతో ఎయిర్‌టెల్ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement