ఇండస్ఇండ్ బ్యాంక్తో హోండా జట్టు
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా ఇండస్‌ఇండ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హోండా టూవీలర్ల కొనుగోలుకు బ్యాంక్.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పించనున్నది. టూవీలర్ పరిశ్రమలో రిటైల్ ఫైనాన్స్ ప్రాధాన్యం పెరుగుతోందని, కస్టమర్లు పలు ఫైనాన్స్ మార్గాలను అన్వేషిస్తున్నారని హెచ్‌ఎంఎస్‌ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యాద్విందర్ సింగ్ గులారియా తెలిపారు.
టూవీలర్ ఫైనాన్సింగ్ విభాగంలో అధిక వాటా లక్ష్యంలో భాగంగా హెచ్‌ఎంఎస్‌ఐతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ (కన్సూమర్ ఫైనాన్స్ విభాగం) ఎస్.వి.పార్థసారథి పేర్కొన్నారు. ఒప్పందంలో ఇందులో భాగంగా కస్టమర్లు గంటలో రుణ ఆమోదం, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి తదితర సౌలభ్యాలను పొందొచ్చని హెచ్‌ఎంఎస్‌ఐ పేర్కొంది. బైక్ విలువలో 90 శాతం వరకు రుణాన్ని పొందొచ్చని, దీన్ని 36 నెలల్లో ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో కట్టొచ్చని వివరించింది.