HMSI
-
హోండా ఫోర్జా 300 డెలివరీలు ప్రారంభం
ముంబై: ప్రముఖ స్కూటర్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన ఫ్లాగ్షిప్ ప్రీమియం మిడ్–సెగ్మెంట్ ద్విచక్ర వాహనం ‘ఫోర్జా 300’ డెలివరీలను ప్రారంభించింది. సంస్థకు చెందిన బిగ్ వింగ్ వ్యాపార విభాగం.. తొలి విడత కింద నాలుగు స్కూటర్లను కస్టమర్లకు మంగళవారం అందజేసింది. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. ‘వినియోగదారుల నుంచి వచ్చిన విశేష స్పందన చూసి డెలివరీలను ఆరంభించాం. యూరో–5 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వెర్షన్‌ను 2021 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తీసుకుని వస్తాం’ అని వెల్లడించారు. నూతనతరం అవసరాలకు తగిన స్కూటర్‌ను అందించడంలో భాగంగా ప్రీమియం మిడ్–సెగ్మెంట్ డెలివరీలను ప్రారంభించినట్లు సంస్థ ప్రెసిడెంట్, ఎండీ మినోరు కటో అన్నారు. -
హోండా ప్లాంట్ నిరవధిక మూసివేత
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) హర్యానా, మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకంది. సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ నోటీసు విడుదల చేసింది. యూనియన్ నాయకులు, ప్లాంట్ మేనేజ్మెంట్ మధ్య సోమవారం చర్చలు జరిగినా సఫలం కాలేదు. దీంతో శాశ్వత కార్మికులు, సంఘాలు, ఇతర కాంట్రాక్ట్ సిబ్బందిపై దుష్ప్రవర్తన ఆరోపణలు గుప్పిస్తూ ప్లాంట్ హెడ్ సైబల్ మైత్రా ఈ నోటీసులిచ్చారు. యూనియన్ నేతలు కాంట్రాక్టు కార్మికులను రెచ్చగొట్టి తమ అక్రమ సమ్మెను కొనసాగించమని పదేపదే కోరడంతోపాటు, కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా నిరసనలకు ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలోఉంచుకుని, ప్లాంట్ సాధారణ కార్యకలాపాలు సాధ్యం కాదని భావించి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించేదీ స్పష్టం చేయలేదు. అయితే ప్లాంట్‌లోని పరిస్థితి సాధారణమైన తర్వాత కార్యకలాపాల పునఃప్రారంభంపై వాటాదారులకు సమాచారం ఇస్తామన్నారు. కాగా ఉత్పత్తి కోత, కాంట్రాక్టు ఉద్యోగులపై భారీగా తొలగించడంపై నవంబర్ 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. అలాగే తమకు జీతాలు పెంచాలని కూడా పర్మినెంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు, ఇతర యూనియన్లు మద్దతు ఇస్తున్నాయి. ప్లాంట్ కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ రమేష్ ప్రధాన్ సమాచారం ప్రకారం, ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే ద్విచక్ర వాహనాల సంఖ్య రోజుకు 6000 నుండి నవంబర్ నాటికి 3500 కు తగ్గింది. దీంతో 2019 ప్రారంభం నుండి మొత్తం 1,000 మంది ఉపాధి కోల్పోయారు. అలాగే నిబంధనల ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు పే స్కేల్ సవరించాలి. అయితే ఆగస్టు 2018 నుండి ఇది పెండింగ్‌లో ఉందని కార్మికులు వాదిస్తున్నారు. -
దూసుకెళ్తోన్న హోండా ‘గ్రేజియా’
ముంబై: దేశీ రెండో అతిపెద్ద టూవీలర్ల తయారీ సంస్థ ‘హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా’ (హెచ్ఎంఎస్ఐ) ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చిన ‘గ్రేజియా’ స్కూటర్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. 75 రోజుల్లోనే 50,000లకు పైగా యూనిట్లు విక్రయమైనట్లు కంపెనీ తెలిపింది. అతి తక్కువ కాలంలో ఈ స్థాయి విక్రయాలు సాధించిన తొలి స్కూటర్ ఇదేనని పేర్కొంది. గ్రేజియా దేశవ్యాప్తంగా కస్టమర్లకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో నెలకు 20,000కు పైగా విక్రయాలు సాధిస్తామని హెచ్ఎంఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.యస్.గులెరియా ధీమా వ్యక్తంచేశారు. ‘మార్కెట్లోకి వచ్చిన తొలి నెలలోనే 17,047 యూనిట్ల అమ్మకాలతో టాప్–10 సెల్లింగ్ స్కూటర్ల జాబితాలో స్థానం పొందింది. తర్వాతి నెలలో 19,000లకుపైగా యూనిట్ల అమ్మకాలు సాధించి టాప్–5లోకి ఎంట్రీ ఇచ్చింది’ అని వివరించారు. 125 సీసీ ఆటోమేటిక్ స్కూటర్ ‘గ్రేజియా’ ప్రారంభ ధర రూ.58,133 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). -
హోండా కొత్త స్కూటర్.. ‘క్లిక్’
ధర రూ.42,499 జైపూర్: దేశీ రెండో అతిపెద్ద టూవీర్ల తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) తాజాగా 110 సీసీ స్కూటర్ ‘హోండా క్లిక్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.42,499 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఇందులో స్పేసియస్ ఫుట్‌బోర్డ్, లార్జ్ అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, హోండా ఎకో టెక్నాలజీతో కూడిన 110 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్–4 ఇంజిన్, సీబీఎస్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. గ్రామీణ మార్కెటే ప్రధాన లక్ష్యంగా ఈ స్కూటర్‌ను ఆవిష్కరించామని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కటో తెలిపారు. గ్రామీణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా అధిక మైలేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను రూపొందించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ మార్కెటింగ్) యద్విందర్ సింగ్ గులెరియా తెలిపారు. కాగా ఈ స్కూటర్‌ను తొలిగా రాజస్తాన్‌లో అందుబాటులోకి తీసుకువస్తామని, తర్వాత దశల వారీగా దేశవ్యాప్తంగా విక్రయిస్తామని చెప్పారు. -
రెండో అతిపెద్ద బైక్స్ తయారీ కంపెనీగా హోండా
బజాజ్ వెనక్కి; టాప్‌లో హీరో ముంబై: హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఏప్రిల్ నెలలో బజాజ్ ఆటోను వెనక్కునెట్టి రెండో అతిపెద్ద బైక్స్ తయారీ కంపెనీగా అవతరించింది. అలాగే టూవీలర్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న హీరో మోటొకార్ప్‌కు కూడా సవాల్ విసురుతోంది. ‘తొలిసారిగా రెండో అతిపెద్ద మోటార్‌సైకిల్ కంపెనీగా అవతరించాం. చాలా ఆనందంగా ఉంది. కంపెనీ బైక్స్ అమ్మకాలు 22% వృద్ధితో 1,83,266 యూనిట్లకు ఎగశాయి’ అని హెచ్ఎంఎస్ఐ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.యస్.గులెరియా తెలిపారు. కాగా బజాజ్ దేశీ విక్రయాలు ఏప్రిల్ నెలలో 19% క్షీణతతో 1,61,930 యూనిట్లకు తగ్గాయి. దీంతో హోండా కంపెనీకి బజాజ్ ఆటోకి మధ్య బైక్స్ విక్రయాల అంతరం 21,336 యూనిట్లుగా నమోదయ్యింది. ఇదేసమయంలో మొత్తం విక్రయాల పరంగా చూస్తే హీరోకి , హోండాకి మధ్య అంతరం 12,377 యూనిట్లుగా ఉంది. ఏప్రిల్‌లో హోండా మొత్తం వాహన విక్రయాలు 34% వృద్ధితో 5,78,929 యూనిట్లకు ఎగిస్తే.. హీరో మొత్తం వాహన అమ్మకాలు మాత్రం 3.5% క్షీణతతో 5,91,306 యూనిట్లకు తగ్గాయి. -
హోండా కొత్త డియో.. ధర రూ.49,132
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా 2017 వెర్షన్ డియో స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బీఎస్–4 నిబంధనలకు అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.49,132గా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉందని తెలిపింది. ఈ కొత్త స్కూటర్లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ (ఏహెచ్‌వో) ఫీచర్ సహా ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్, డ్యూయెల్ టోన్ కలర్ బాడీ, స్పోర్టియర్ గ్రాఫిక్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. కాగా హోండా కంపెనీ 2002లో డియో స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. -
టూ వీలర్స్ పై భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాల నేపథ్యంలో ఉన్న స్టాక్ ను విక్రయించేందుకు దేశీయ ఆటో కంపెనీలు ఆగమేఘాల కదులు తున్నాయి. బీఎస్-3 వాహనాలను నిషేధిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో ప్రముఖ టూవీలర్ మేజర్లు భారీ డిస్కౌంట్లను ఆఫర్లను ప్రకటించాయి. డీలర్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం మార్కెట్ లీడర్హీరో మోటార్ కార్ప్ స్కూటర్లపై రూ.12500, ప్రీమియం బైక్స్‌పై రూ.7500, ఎంట్రీ లెవర్ మెటార్ సైకిళ్లపై రూ.5వేల దాకా తగ్గింపును ప్రకటించింది. అలాగే హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అయితే బీఎస్-3 స్కూటర్లపై కొనుగోలుపై రూ. 10వేల డిస్కౌంట్ అంద్తిస్తోంది. స్టాక్ అయిపోయే దాకా లేదా మార్చి 31 దాకా ఆ ఫర్ వర్తించనున్నట్టు ఇరు కంపెనీలు ప్రకటించాయి. టూవీలర్స్ ఇండస్ట్రీలో ఈ రాయితీలను ఎప్పుడూ చూడలేదని ఆటోమొబైల్ డీలర్స్ ఫెడరేషన్, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ నికుంజ్ సాంగ్వి పిటిఐకి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీలర్స్ చర్యలు గురించి అడిగినప్పుడు, గడువులోపు సాధ్యమైనన్ని వాహనాలను విక్రయించడంపైనే అంతా దృష్టి పెట్టినట్టు తెలిపారు. కాగా ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాలను అమ్మకాలను, రిజిస్ట్రేషన్ నిషేధిస్తూ సుప్రీం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కాలుష్య నివారణలో భాగంగా తయారీదారుల వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యం చాలా చాలా ముఖ్యమైన సుప్రీం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. -
హోండా యాక్టివాలో 4జీ వచ్చేసింది..
న్యూఢిల్లీ : హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) యాక్టివాలో నాలుగో జనరేషన్(4జీ) మోడల్‌ను విడుదల చేసింది. హెచ్ఎంఎస్ఐ ఇప్పటికే యాక్టివా 3జీ, యాక్టివా 125, యాక్టివా ఐ అనే మూడు వాహన సిరీస్‌లను వినియోగదారులకు అందిస్తోంది. యాక్టివా 4జీలో కొత్తగా బీఎస్IV ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. ఫ్యామిలీ స్కూటర్‌గా పేరున్న యాక్టివాలో నాలుగో జనరేషన్, వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుందని హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ గులేరియా అన్నారు. ఈ వేరియంట్లో మైబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉండనుందని తెలిపారు. అంతే కాకుండా ఈ యాక్టివా 4జీ మరిన్ని ఎక్కువ రంగుల్లో అందుబాటు ఉండనుందని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ కోంబీ బ్రేక్ సిస్టమ్(సీబీఎస్), కొత్త ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఆన్(ఏహెచ్ఓ) ఫీచర్లు యాక్టివా 4జీలో ఉన్నాయి. ఏడు విభిన్న రంగులు..మ్యాట్ సెలెన్ సిల్వర్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ మెటాలిక్, ట్రాన్స్ బ్లూ మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, బ్లాక్, వైట్, మెజిస్టిక్ బ్రౌన్లలో యాక్టివా 4జీ లభ్యం కానుంది. భారత టూవీలర్ ఇండస్ట్రీలో 110 సీసీ ఆటోమెటిక్ సెగ్మెంట్ ద్విచక్రవాహనాల అమ్మకాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ సమయంలోనే మరిన్ని సదుపాయాలను కల్పిస్తూ యాక్టివా 4జీ వేరియంట్‌ను విడుదల చేసింది. హోండా యాక్టివా 4జీ ధర రూ. 50,730 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించారు. -
హోండా సీబీ యూనికార్న్‌లో కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కం పెనీ సీబీ యూనికార్న్ 160 మోడల్లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. భారత్ స్టేజ్ ఫోర్(బీఎస్–ఫోర్) ప్రమాణాలకనుగుణంగా ఈ బైక్‌ను అందిస్తున్నామనిహెచ్ఎంఎస్ఐ తెలిపింది. ఈ బైక్ ధర రూ.73,552(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని హెచ్ఎంఎస్ఐ సీనియర్ వైస్–ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైఎస్ గులేరియా చెప్పారు. ఆటోమేటిక్ హెడ్లైట్స్ఆన్ (ఏహెచ్ఓ) ఫీచర్ ఈ బైక్ ప్రత్యేకతఅని వివరించారు. భారత్‌లో 150–160సీసీ సెగ్మెంట్.. పోటీ అత్యంత తీవ్రంగా ఉండే సెగ్మంట్అని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజీ ఇచ్చే పట్టణ బైక్‌గా ఈ బైక్ మంచి విజయం సాధించిందని వివరించారు. 162.71 సీసీ ఎయిర్‌కూల్డ్,సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రూపాందిన ఈ బైక్‌ను హోండా ఈకో టెక్నాలజీతో రూపొందించామని పేర్కొన్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్‌తో హోండా జట్టు
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హోండా టూవీలర్ల కొనుగోలుకు బ్యాంక్.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పించనున్నది. టూవీలర్ పరిశ్రమలో రిటైల్ ఫైనాన్స్ ప్రాధాన్యం పెరుగుతోందని, కస్టమర్లు పలు ఫైనాన్స్ మార్గాలను అన్వేషిస్తున్నారని హెచ్ఎంఎస్ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యాద్విందర్ సింగ్ గులారియా తెలిపారు. టూవీలర్ ఫైనాన్సింగ్ విభాగంలో అధిక వాటా లక్ష్యంలో భాగంగా హెచ్ఎంఎస్ఐతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ (కన్సూమర్ ఫైనాన్స్ విభాగం) ఎస్.వి.పార్థసారథి పేర్కొన్నారు. ఒప్పందంలో ఇందులో భాగంగా కస్టమర్లు గంటలో రుణ ఆమోదం, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి తదితర సౌలభ్యాలను పొందొచ్చని హెచ్ఎంఎస్ఐ పేర్కొంది. బైక్ విలువలో 90 శాతం వరకు రుణాన్ని పొందొచ్చని, దీన్ని 36 నెలల్లో ఇన్స్టాల్మెంట్ల రూపంలో కట్టొచ్చని వివరించింది. -
హోండా సీబీ షైన్.. కొత్త మోడల్ ధర రూ.60,000-64,400
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కంపెనీ ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్ బైక్ కేటగిరిలో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సీబీ షైన్ ఎస్పీ పేరుతో అందిస్తున్న ఈ 125 సీసీ మోడల్ బైక్ ధరలు రూ.59,900 నుంచి రూ.64,400(ఎక్స్ షోరూ మ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్ బైక్‌లను ఏడాది కాలంలో 3 లక్షలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్. గులేరియా చెప్పారు. ఇప్పటివరకూ 43 లక్షల షైన్ బైక్‌లను విక్రయించామని వివరించారు. గుజరాత్లో ప్లాంట్ నిర్మాణానికి రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. -
సీబీఆర్ 650 ఎఫ్ @ 7.3 లక్షలు
- హోండా నుంచి కొత్త స్పోర్ట్ ్స బైక్ న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కంపెనీ కొత్తగా స్పోర్ట్స్ బైక్ సీబీఆర్ 650 ఎఫ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ బైక్ ధరరూ.7.3 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది 15 కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చే వ్యూహాంలో భాగంగా ఈ స్పోర్ట్స్ బైక్‌ను అందిస్తున్నామని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. ఈ బైక్‌తో పాటు మరో నాలుగు కొత్త మోడళ్లను కూడా కంపెనీ ఈ సందర్భంగా ఆవిష్కరించింది. కొత్తగా మార్కెట్లోకి తేనున్న 160 సీసీ బైక్ సీబీ హార్నెట్ 160ఆర్‌ను, సీబీఆర్ 250ఆర్, సీబీఆర్ 150ఆర్ మోడళ్లలో అప్డేటెడ్ వెర్షన్లను, మిస్టరీ మోటార్‌సైకిల్‌ను కూడా ప్రదర్శించింది. బైక్ ప్రత్యేకతలు...: ఈ ఫుల్ ఫెయిర్డ్ సీబీఆర్ 650 ఎఫ్ బైక్‌లో 649 సీసీ డబుల్ ఓవర్‌హెడ్ కాంషిఫ్ట్(డీఓహెచ్సీ) లిక్విడ్ కూల్ ఇంజిన్, ఆరు గేర్లు, మోనో షాక్ సస్పెన్షన్, టాకోమీటర్, రెండు ట్రిప్ మీటర్లు, ఫ్యూయల్ గేజ్, గడియారం తదితర ఫీచర్లతో కూడిన ఇన్స్ట్రుమెంటల్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మైలేజీ లీటర్‌కు 21 కిమీ. ఈ బైక్ కవాసాకి నింజా 650, బెనెల్లి టీఎన్టీ 600 జీబీ బైక్‌లకు పోటీనిస్తుందని అంచనా. ఈ బైక్‌ను థాయ్‌లాండ్, జపాన్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకొని మానేసర్ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేస్తున్నారు. -
110 సీసీలో హోండా కొత్త బైక్.. లివో
- ధర రూ. 52,989- రూ.55,489 - మైలేజీ 74 కి.మీ. అంటోన్న కంపెనీ న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) 110 సీసీ కేటగిరిలో కొత్తగా లివో బైక్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. సీబీ ట్విస్టర్ స్థానంలో ఈ కొత్త బైక్‌ను కంపెనీ అందిస్తోందని సమాచారం. 2 వేరియంట్లలో, 4 రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతోంది. లివో సెల్ఫ్ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.52,989, లివో సెల్ఫ్ డిస్క్ అలాయ్ ...ధర రూ.55,489 (రెండూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. 110 సీసీ కేటగిరిలో హోండా అందిస్తున్న నాలుగో మోడల్ ఇది. గతంలో డ్రీమ్ యుగ, డ్రీమ్ నువో, సీబీ ట్విస్టర్ మోడళ్లను అందించింది. తాము తేనున్న కొత్త, వినూత్నమైన మోడళ్లకు ఈ లివో బైక్ నాంది అని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. బైక్ ప్రత్యేకతలు...: సీబీ ట్విస్టర్తో సహా పలు హోండా బైక్‌ల స్ఫూర్తితో ఈ కొత్త హోండా లివోను డిజైన్ చేసినట్లుగా కనబడుతోంది. అవడానికి ఎంట్రీ లెవల్ బైక్ అయినా చూడ్డానికి స్పోర్ట్స్ బైక్ అనిపించేలా ఈ బైక్‌ను రూపొందించారు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 4గేర్లు, మైలేజీని పెంచే హోండా ఈకో టెక్నాలజీతో రూపొందిన ఈ బైక్‌లో ఓడోమీటర్,స్పీడో మీటర్, ఫ్యూయల్ గేజ్‌తో కూడిన అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యుయల్ షాక్ రియర్ అబ్జార్బర్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. గరిష్ట వేగం గంటకు 86 కిమీ. ప్రయాణించే ఈ బైక్ 74 కిమీ. మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. -
హీరో, హోండాల మధ్య మైలేజీ చిచ్చు
⇒ ఐ స్మార్ట్ బైక్ మైలేజీ 102.5 కిమీ: హీరో మోటో ⇒ బేస్ ఇంజిన్ మేం తయారు చేసిందే, అంత మైలేజీ గ్యారంటీ లేదు: హోండా న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కొత్త బైక్ స్ప్లెండర్ ఐ స్మార్ట్ బైక్ లీటర్‌కు 102.5 కిమీ మైలీజినిస్తుందని హీరో మోటోకార్ప్ ప్రచారం హీరో మోటొకార్ప్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కంపెనీల మధ్య వివాదం రేపుతోంది. ఇంత మైలేజీ వస్తుందని చెప్పడం వినియోగదారులను మోసం చేయడమేనని, ఇది వాస్తవ విరుద్ధమని హెచ్ఎంఎస్ఐ విమర్శించింది. స్ప్లెండర్ బేస్ ఇంజన్‌ను తామే రూపొందించామని హోండా ఆర్ అండ్ డీ సెంటర్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కీజి కస తెలిపారు. పూర్తి నియంత్రిత వాతావరణంలోనూ ఇంత మైలేజీ నిలకడగా కొనసాగించడం కష్టమని పేర్కొన్నారు. అయితే ఈ మైలేజీ వివరాలు ప్రభుత్వం ఆధీనంలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఐ క్యాట్) ధ్రువీకరించినవేనని హీరో మోటోకార్ప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ మైలేజీ వివరాలను సవాల్ చేయడమంటే భారత ప్రభుత్వం నెలకొల్పిన ప్రమాణాలు, నియమనిబంధనలను ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. హీరో గ్రూప్, హోండా కంపెనీలు తమ 26 ఏళ్ల భాగస్వామ్య ఒప్పందాన్ని 2010లో రద్దు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఈ రెండు కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. -
హోండా చౌక బైక్ వచ్చేసింది
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ కొత్త మోటార్ సైకిల్, సీడీ 110 డ్రీమ్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ధర రూ. 41,100(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. హోండా కంపెనీ నుంచి వస్తోన్న అత్యంత చౌక బైక్ ఇది. 110 సీసీ కేటగిరీలో కంపెనీ అందిస్తోన్న డ్రీమ్ బ్రాండ్ మూడో బైక్ కూడా. ఈ కొత్త సీడీ 110 బైక్ ధర, ఈ కంపెనీయే విక్రయిస్తున్న ఈ కేటగిరీ మోటార్‌సైకిళ్లు -డ్రీమ్ నియో బైక్ కంటే రూ.5,000, డ్రీమ్ యుగ కంటే రూ.7,000 తక్కువ. గ్రామీణ, మాస్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా హోండా కంపెనీ ఈ బైక్‌ను తెస్తోంది. 100-110 సీసీ సెగ్మెంట్ అవసరాలను తీర్చేలా ఈ బైక్‌ను అందిస్తున్నామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) యద్విందర్ ఎస్. గులేరియా పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి విక్రయాలు ఇతర హోండా డ్రీమ్ బైక్‌ల్లో ఉపయోగించే 110 సీసీ ఇంజిన్నే ఈ సీడీ 110 డ్రీమ్ బైక్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. హోండా ఈకో టెక్నాలజీ(హెచ్ఈటీ) కారణంగా ఈ బైక్ 74 కి.మీ. మైలేజీని ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, విస్కస్ ఎయిర్ ఫిల్టర్ తదితర ఫీచర్లున్నాయి. హీరో మోటోకార్ప్‌కు చెందిన హెచ్ఎఫ్-డీలక్స్, టీవీఎస్ స్టార్ సిటీలకు ఇది గట్టిపోటీనిస్తుందని పరిశ్రమవర్గాల అంచనా. ఇతర డ్రీమ్ బైక్‌లకు, ఈ తాజా బైక్‌కు పెద్దగా తేడా లేదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. సిల్వర్ కలర్ అలాయ్ వీల్స్, బాడీ గ్రాఫిక్స్ మాత్రం విభిన్నంగా ఉన్నాయి. రూర్బన్(రూరల్, ఆర్బన్) వినియోగదారులు లక్ష్యంగా కంపెనీ ఈ బైక్‌ను అందిస్తోంది. ఈ బైక్ మూడు రంగుల్లో లభ్యమవుతుంది. నలుపు రంగుపై రెడ్, బ్లూ, గ్రే చారలతో ఈ బైక్ లభిస్తుంది. డీలర్లకు డిస్పాచెస్ ఈ నెల రెండో వారం నుంచి కంపెనీ ప్రారంభిస్తుంది. త్వరలో హోండా 160 సీసీలో కొత్త బైక్‌ను తేనున్నది. 25% వాటా... ఈ కంపెనీ ప్రస్తుతం 100-110 సీసీ సెగ్మంట్లో డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో, సీబీ ట్విస్టర్ మోడళ్లను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 100-110 సీసీ సెగ్మెంట్లో 7.3 లక్షల బైక్‌లను విక్రయించామని గులేరియా చెప్పారు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కొత్త బైక్‌తో ఈ సంఖ్య 8 లక్షలకు చేరగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో భారత టూ-వీలర్ కేటగిరీలో 25 శాతం మార్కెట్ వాటా సాధించామని చెప్పారు. హోండా ఈజ్ హోండా గత ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్యకలాపాల నిమిత్తం రూ.5,200 కోట్లు పెట్టుబడులు పెట్టామని గులేరియా వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ మానేసర్(హర్యానా), తపుకుర(రాజస్థాన్), నర్సాపుర(కర్నాటక)ల్లోని మూడు ప్లాంట్లలో టూవీలర్లను తయారు చేస్తోంది. ఈ మూడు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46 లక్షలు. నాలుగో ప్లాంట్ గుజరాత్లో నిర్మాణంలో ఉంది. నాలుగో ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 58 లక్షలకు పెరుగుతుంది. హోండా ఈజ్ హోండా... పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ఈ కంపెనీ ప్రారంభించింది. -
అయినా క్షీణతే...
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా వాహన కంపెనీలు ధరలను తగ్గించినప్పటికీ, ‘ఆ ఫలితం పూర్తిగా అందకపోవడం కారణంగా’ ఫిబ్రవరిలో వాహన విక్రయాలు నిరాశమయంగానే ఉన్నాయి. అధికంగా ఉన్న ఇంధనం ధరలు, వడ్డీ రేట్లు వంటి అంశాలు వాహన అమ్మకాలపై తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయని వాహన కంపెనీలు వాపోతున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా ఎంక్వైరీలైతే పెరిగాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో వాహన అమ్మకాల తీరు.. కంపెనీ 2014 2013 వృ/క్షీ(%లో) హోండా కార్స్ 14,543 6,510 123 ఫోర్డ్ ఇండియా 12,253 7,253 69 మారుతీ సుజుకి 1,09,104 1,09,567 -0.4 హ్యుందాయ్ 46,505 54,665 -15 టాటా మోటార్స్ 39,951 61,998 -36 మహీంద్రా 42,166 47,824 -12 టయోటా 11,284 13,979 -19 మహీంద్రా ట్రాక్టర్ 17,592 14,861 18 టీవీఎస్ 1,77,762 1,65,696 7 హోండా మోటార్ సైకిల్ 3,28,521 2,28,444 44 -
టూవీలర్ల అమ్మకాలు ఓకే
న్యూఢిల్లీ: టూవీలర్ల అమ్మకాలు డిసెంబర్ నెలలో ఫర్వాలేదనిపించాయి. యమహా, హోండా మోటార్ సైకిల్, టీవీఎస్ మోటార్ కంపెనీల అమ్మకాలు పెరిగాయి. హీరో మోటోకార్ప్ అమ్మకాలు తగ్గాయి. అయితే గత ఏడాది మొత్తం మీద ఈ కంపెనీ రికార్డ్‌స్థాయి అమ్మకాలు (61,83,784) సాధించింది. ఇక లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్, హోండా కార్ల కంపెనీల విక్రయాలు పెరగ్గా, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఎస్కార్ట్స్ అమ్మకాలు తగ్గాయి. గత ఏడాది మొత్తం 61,83,784 టూవీలర్లను విక్రయించామని హీరో మోటో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ దువా పేర్కొన్నారు. 2012 అమ్మకాల(61,20,259)తో పోల్చితే 1% వృద్ధి సాధించామని వివరించారు. ఈ ఏడాది మరిన్ని కొత్త బైక్‌లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. హోండా మోటార్ సైకిల్ కంపెనీ బైక్‌ల అమ్మకాలు 18%, స్కూటర్ల అమ్మకాలు 54% చొప్పున పెరిగాయి. దేశీయ అమ్మకాలు 58%, ఎగుమతులు 13% చొప్పున వృద్ధి సాధించాయని యమహా పేర్కొంది. మొత్తంమీద గతేడాది అమ్మకాలు 34% పెరిగాయని తెలిపింది. టీవీఎస్ మోటార్ స్కూటర్ల అమ్మకాలు 36%, త్రీ వీలర్ల అమ్మకాలు 37%, ఎగుమతులు 27% చొప్పున పెరిగాయి.