హోండా సీబీ యూనికార్న్‌లో కొత్త వేరియంట్‌ | HMSI launches BS-IV compliant 'CB Unicorn 160' at Rs 73552 | Sakshi
Sakshi News home page

హోండా సీబీ యూనికార్న్‌లో కొత్త వేరియంట్‌

Published Tue, Jan 10 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

హోండా సీబీ యూనికార్న్‌లో కొత్త వేరియంట్‌

హోండా సీబీ యూనికార్న్‌లో కొత్త వేరియంట్‌

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) కం పెనీ సీబీ యూనికార్న్‌ 160 మోడల్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. భారత్‌ స్టేజ్‌ ఫోర్‌(బీఎస్‌–ఫోర్‌) ప్రమాణాలకనుగుణంగా ఈ బైక్‌ను అందిస్తున్నామనిహెచ్‌ఎంఎస్‌ఐ తెలిపింది. ఈ బైక్‌  ధర రూ.73,552(ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని హెచ్‌ఎంఎస్‌ఐ సీనియర్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ సేల్స్‌ అండ్‌  మార్కెటింగ్‌ వైఎస్‌ గులేరియా చెప్పారు.

ఆటోమేటిక్‌ హెడ్‌లైట్స్‌ఆన్‌ (ఏహెచ్‌ఓ) ఫీచర్‌  ఈ బైక్‌ ప్రత్యేకతఅని వివరించారు. భారత్‌లో 150–160సీసీ సెగ్మెంట్‌.. పోటీ అత్యంత తీవ్రంగా ఉండే సెగ్మంట్‌అని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజీ ఇచ్చే  పట్టణ బైక్‌గా ఈ బైక్‌ మంచి విజయం సాధించిందని వివరించారు. 162.71 సీసీ ఎయిర్‌కూల్డ్,సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో రూపాందిన ఈ బైక్‌ను హోండా ఈకో టెక్నాలజీతో రూపొందించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement