![Honda Starts Delivery Forza 300 Scooter - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/19/honda.jpg.webp?itok=vV5550YF)
ముంబై: ప్రముఖ స్కూటర్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తన ఫ్లాగ్‌షిప్ ప్రీమియం మిడ్–సెగ్మెంట్ ద్విచక్ర వాహనం ‘ఫోర్జా 300’ డెలివరీలను ప్రారంభించింది. సంస్థకు చెందిన బిగ్ వింగ్ వ్యాపార విభాగం.. తొలి విడత కింద నాలుగు స్కూటర్లను కస్టమర్లకు మంగళవారం అందజేసింది. ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్‌ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. ‘వినియోగదారుల నుంచి వచ్చిన విశేష స్పందన చూసి డెలివరీలను ఆరంభించాం. యూరో–5 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వెర్షన్‌ను 2021 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తీసుకుని వస్తాం’ అని వెల్లడించారు. నూతనతరం అవసరాలకు తగిన స్కూటర్‌ను అందించడంలో భాగంగా ప్రీమియం మిడ్–సెగ్మెంట్ డెలివరీలను ప్రారంభించినట్లు సంస్థ ప్రెసిడెంట్, ఎండీ మినోరు కటో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment