హోండా కొత్త స్కూటర్‌.. ‘క్లిక్‌’ | Honda Cliq 110 cc Scooter Launched In India; Priced At Rs. 42,499 | Sakshi
Sakshi News home page

హోండా కొత్త స్కూటర్‌.. ‘క్లిక్‌’

Published Wed, Jun 21 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

హోండా కొత్త స్కూటర్‌.. ‘క్లిక్‌’

హోండా కొత్త స్కూటర్‌.. ‘క్లిక్‌’

ధర రూ.42,499
జైపూర్‌: దేశీ రెండో అతిపెద్ద టూవీర్ల తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా 110 సీసీ స్కూటర్‌ ‘హోండా క్లిక్‌’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.42,499 (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ). ఇందులో స్పేసియస్‌ ఫుట్‌బోర్డ్, లార్జ్‌ అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ స్పేస్, హోండా ఎకో టెక్నాలజీతో కూడిన 110 సీసీ సింగిల్‌ సిలిండర్‌ బీఎస్‌–4 ఇంజిన్, సీబీఎస్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.

గ్రామీణ మార్కెటే ప్రధాన లక్ష్యంగా ఈ స్కూటర్‌ను ఆవిష్కరించామని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మినోరు కటో తెలిపారు. గ్రామీణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా అధిక మైలేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను రూపొందించామని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ మార్కెటింగ్‌) యద్విందర్‌ సింగ్‌ గులెరియా తెలిపారు. కాగా ఈ స్కూటర్‌ను తొలిగా రాజస్తాన్‌లో అందుబాటులోకి తీసుకువస్తామని, తర్వాత దశల వారీగా దేశవ్యాప్తంగా విక్రయిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement