
ముంబై: దేశీ రెండో అతిపెద్ద టూవీలర్ల తయారీ సంస్థ ‘హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా’ (హెచ్‌ఎంఎస్‌ఐ) ఇటీవల మార్కెట్‌లోకి తీసుకువచ్చిన ‘గ్రేజియా’ స్కూటర్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. 75 రోజుల్లోనే 50,000లకు పైగా యూనిట్లు విక్రయమైనట్లు కంపెనీ తెలిపింది. అతి తక్కువ కాలంలో ఈ స్థాయి విక్రయాలు సాధించిన తొలి స్కూటర్ ఇదేనని పేర్కొంది.
గ్రేజియా దేశవ్యాప్తంగా కస్టమర్లకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో నెలకు 20,000కు పైగా విక్రయాలు సాధిస్తామని హెచ్‌ఎంఎస్‌ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.యస్.గులెరియా ధీమా వ్యక్తంచేశారు. ‘మార్కెట్‌లోకి వచ్చిన తొలి నెలలోనే 17,047 యూనిట్ల అమ్మకాలతో టాప్–10 సెల్లింగ్ స్కూటర్ల జాబితాలో స్థానం పొందింది. తర్వాతి నెలలో 19,000లకుపైగా యూనిట్ల అమ్మకాలు సాధించి టాప్–5లోకి ఎంట్రీ ఇచ్చింది’ అని వివరించారు. 125 సీసీ ఆటోమేటిక్ స్కూటర్ ‘గ్రేజియా’ ప్రారంభ ధర రూ.58,133 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ).
Comments
Please login to add a commentAdd a comment