CB Unicorn
-
హోండా సీబీ యూనికాన్ 150 సరికొత్తగా
సాక్షి, న్యూఢిల్లీ : హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. సీబీ యూనికాన్ 150 అపడేటెడ్ వెర్షన్‌గా ఈ సరికొత్త బైక్‌ను ఆవిష్కరించింది. దీని ధరను.రూ .78, 815 (ఎక్స్ షో రూం, ఢిల్లీ) గా నిర్ణయించింది. 150 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజీన్, ఫైవ్ స్పీడ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ సింగిల్ చానెల్ ఏబీస్, 18అంగుళాల అల్లోయ్ వీల్స్, ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. దీని ఇంజీన్ 12.7 బీహెచ్పీ వద్ద 12.8 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇక 150 సీసీ సెగ్మెంట్లో మార్కెట్లో బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, హీరో అఛీవర్ 150కి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
హోండా సీబీ యూనికార్న్‌లో కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కం పెనీ సీబీ యూనికార్న్ 160 మోడల్లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. భారత్ స్టేజ్ ఫోర్(బీఎస్–ఫోర్) ప్రమాణాలకనుగుణంగా ఈ బైక్‌ను అందిస్తున్నామనిహెచ్ఎంఎస్ఐ తెలిపింది. ఈ బైక్ ధర రూ.73,552(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని హెచ్ఎంఎస్ఐ సీనియర్ వైస్–ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైఎస్ గులేరియా చెప్పారు. ఆటోమేటిక్ హెడ్లైట్స్ఆన్ (ఏహెచ్ఓ) ఫీచర్ ఈ బైక్ ప్రత్యేకతఅని వివరించారు. భారత్‌లో 150–160సీసీ సెగ్మెంట్.. పోటీ అత్యంత తీవ్రంగా ఉండే సెగ్మంట్అని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజీ ఇచ్చే పట్టణ బైక్‌గా ఈ బైక్ మంచి విజయం సాధించిందని వివరించారు. 162.71 సీసీ ఎయిర్‌కూల్డ్,సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రూపాందిన ఈ బైక్‌ను హోండా ఈకో టెక్నాలజీతో రూపొందించామని పేర్కొన్నారు.