
సాక్షి, న్యూఢిల్లీ : హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. సీబీ యూనికాన్ 150 అపడేటెడ్ వెర్షన్‌గా ఈ సరికొత్త బైక్‌ను ఆవిష్కరించింది. దీని ధరను.రూ .78, 815 (ఎక్స్ షో రూం, ఢిల్లీ) గా నిర్ణయించింది.
150 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజీన్, ఫైవ్ స్పీడ్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్ సింగిల్ చానెల్ ఏబీస్, 18అంగుళాల అల్లోయ్ వీల్స్, ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. దీని ఇంజీన్ 12.7 బీహెచ్‌పీ వద్ద 12.8 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇక 150 సీసీ సెగ్మెంట్‌లో మార్కెట్లో బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, హీరో అఛీవర్ 150కి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment