Honda Motorcycle & Scooter
-
హోండా సీబీ యూనికాన్ 150 సరికొత్తగా
సాక్షి, న్యూఢిల్లీ : హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. సీబీ యూనికాన్ 150 అపడేటెడ్ వెర్షన్‌గా ఈ సరికొత్త బైక్‌ను ఆవిష్కరించింది. దీని ధరను.రూ .78, 815 (ఎక్స్ షో రూం, ఢిల్లీ) గా నిర్ణయించింది. 150 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజీన్, ఫైవ్ స్పీడ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ సింగిల్ చానెల్ ఏబీస్, 18అంగుళాల అల్లోయ్ వీల్స్, ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. దీని ఇంజీన్ 12.7 బీహెచ్పీ వద్ద 12.8 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇక 150 సీసీ సెగ్మెంట్లో మార్కెట్లో బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, హీరో అఛీవర్ 150కి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
హోండా టూవీలర్ల విక్రయాలు @ కోటిన్నర
న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ టూవీలర్ల విక్రయాలు 1.5కోట్ల మైలురాయిని చేరాయి. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన 13 ఏళ్లకు ఈ ఘనత సాధించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.ఎస్. గులేరియా చెప్పారు. ఇంత స్వల్పకాలంలోనే ఈ ఘనత సాధించడం హోండా బ్రాండ్‌పై పెరుగుతున్న వినియోగదారుల నమ్మకానికి నిదర్శనమని వివరించారు. కోటి వాహన విక్రయాలను 2012 జూలైలో సాధించామని, తాజా అరకోటి వాహన అమ్మకాలు 18 నెలల్లోనే సాధించామని వివరించారు. మాస్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లోకి డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో బైక్‌లతో ప్రవేశించామని, ఈ బైక్‌లతోనే మంచి వృద్ధి సాధించామని పేర్కొన్నారు. తమ విక్రయ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తున్నామని, తర్వలో 500 కొత్త టచ్-పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని దీంతో తమ నెట్వర్క్ 2,500కు పెరుగుతుందని గులేరియా వివరించారు.