హోండా టూవీలర్ల విక్రయాలు @ కోటిన్నర | HMSI crosses 15 million two-wheeler units milestone | Sakshi
Sakshi News home page

హోండా టూవీలర్ల విక్రయాలు @ కోటిన్నర

Published Fri, Jan 24 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

హోండా టూవీలర్ల విక్రయాలు @ కోటిన్నర

హోండా టూవీలర్ల విక్రయాలు @ కోటిన్నర

న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ టూవీలర్ల విక్రయాలు 1.5కోట్ల మైలురాయిని చేరాయి. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన 13 ఏళ్లకు ఈ ఘనత సాధించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.ఎస్. గులేరియా చెప్పారు. ఇంత స్వల్పకాలంలోనే ఈ ఘనత సాధించడం హోండా బ్రాండ్‌పై పెరుగుతున్న వినియోగదారుల నమ్మకానికి నిదర్శనమని వివరించారు. కోటి వాహన విక్రయాలను 2012 జూలైలో సాధించామని, తాజా అరకోటి వాహన అమ్మకాలు 18 నెలల్లోనే సాధించామని వివరించారు. మాస్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లోకి డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో బైక్‌లతో ప్రవేశించామని, ఈ బైక్‌లతోనే మంచి వృద్ధి సాధించామని పేర్కొన్నారు. తమ విక్రయ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తున్నామని, తర్వలో 500  కొత్త టచ్-పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని దీంతో తమ నెట్‌వర్క్ 2,500కు పెరుగుతుందని గులేరియా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement