Honda Motors
-
పలు కార్ల మోడళ్లపై తగ్గింపును ప్రకటించిన హోండా మోటార్స్
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఫిబ్రవరి నెల గాను పలు కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ మోడల్ లైనప్‌లో అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ కార్లపై లాభదాయకమైన డీల్‌లను కొనుగోలుదారులకు అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, ఎఫ్ఓసీ ఉపకరణాలు, కార్పొరేట్ బోనస్‌లను హోండా అందిస్తోంది. హోండా సిటీ 5 జనరేషన్ జపనీస్ కార్‌మేకర్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ హోండా సిటీ మోడల్‌పై ఏకంగా రూ. 33,500 వరకు తగ్గింపుతో రానుంది. క్యాష్ బెనిఫిట్ రూ. 10,000. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ బోనస్ రూ. 8,000 కొనుగోలుదారులు పొందవచ్చు. ఎఫ్ఓసీ యాక్సెసరీస్‌పై సుమారు రూ. 10, 500 ప్రయోజనాలను హోండా అందిస్తోంది. హోండా జాజ్ హోండా జాజ్ కొనుగోలుపై రూ. 33,100 వరకు నగదు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది, ఇందులో క్యాష్ బెనిఫిట్స్ రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ రెండు కలిపి రూ. 12000, కార్పొరేట్ తగ్గింపు రూ. 4000 వరకు లభిస్తాయి. ఎఫ్ఓసీ యాక్సెరీస్పై రూ. 12,100 మేర ప్రయోజనాలను హోండా అందిస్తోంది. హోండా డబ్ల్యూఆర్-వీ ఈ కారు కొనుగోలుపై రూ. 26,100 ప్రయోజనాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ బోనస్ , లాయల్టీ బోనస్ కార్పొరేట్ బెనిఫిట్లను హోండా అందిస్తోంది. హోండా సిటీ 4 జనరేషన్ హోండా సిటీ 4 జనరేషన్ కారుపై సుమారు రూ. 20వేల వరకు తగ్గింపును హోండా అందిస్తోంది. లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 7,000, హోండా సిటీ కొనుగోలుపై 8,000 కార్పొరేట్ తగ్గింపు రానుంది. హోండా అమేజ్ హోండా కార్లలో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా హోండా అమేజ్ నిలిచింది. ఫిబ్రవరి నెలకు గాను రూ. 15,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. ఇందులో కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000గా ఉంది. -
యువత కోసం మార్కెట్లోకి హోండా గ్రాజియా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్
ఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామిగా ఉన్న హోండా మోటార్ సైకిల్ ఇండియా మార్కెట్లోకి గ్రాజియా 125 సీసీ రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. గుర్గావ్ ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.87,138 ఉంది. రెప్సోల్ హోండా రేసింగ్ టీమ్ డిజైన్ థీమ్, గ్రాఫిక్స్ స్ఫూర్తితో గ్రేజియా 125 రెప్సాల్ హోండా టీమ్ ఎడిషన్‌ను రూపొందించినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్, సీఈఓ అత్సుషి ఒగాటా వెల్లడించారు. ఈ స్కూటర్‌ను దేశీయంగా యువత ఔత్సాహికుల కోసం విడుదల చేసినట్లు తెలిపారు. ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్((పీజీఎం-ఎఫ్ఐ) ఇంజన్, ఐడ్లింగ్ స్టాప్ వ్యవస్థ, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ (ఈఎస్పీ), మల్టీ-ఫంక్షన్ స్విచ్, ఇంజిన్-కటాఫ్‌తో సైడ్ స్టాండ్ ఇండికేటర్, మూడు దశల్లో సర్దుబాటు చేసే రేర్ సస్పెన్షన్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వంటి సదుపాయాలు ఈ స్కూటర్‌ను రూపొందించారు. (చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!) -
ఎలక్ట్రిక్ మార్కెట్లోకి హోండా మోటార్స్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా(హెైచ్ఎంఎస్ఐ) భారత్‌లోని ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నహాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో యాక్టివా, షైన్ వంటి ప్రముఖ మోడల్స్ విక్రయించే ఈ సంస్థ తన డీలర్ భాగస్వాములతో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అట్సుషి ఒగాటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "జపాన్ హోండా మోటార్ కంపెనీ తన మాతృ సంస్థతో చర్చించిన తర్వాత ఈ విభాగంలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈవీ వాహనలను తయారు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనం కోసం విడిభాగాల సేకరణ, సరఫరా భాగస్వాములకు చర్చలు ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఈవీలను ఎగుమతి చేస్తామని కంపెనీ వెల్లడించింది.(చదవండి: ఇండియన్ మార్కెట్లోకి లండన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు) ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇస్తున్నందున విదేశీ కంపెనీలతో సహా పలు కంపెనీలు ఈవీ విభాగంలోకి ప్రవేశిస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు మెట్రో నగరాలకు మాత్రమే చేరువ అయ్యాయని చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ కాలేదని అన్నారు. ఈవీ ప్రొడక్ట్ కు మాత్రమే పరిమితం కాకుండా బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ తయారీ విషయాన్ని కూడా కంపెనీ పరిగణనలోకి తీసుకోబోతోందని ఒగాటా పేర్కొన్నారు. హోండా మోటార్ ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి మూడు వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించింది. ఇప్పటికే చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ రాబోయే రెండేళ్లలో 5 నుంచి 25 కిలోవాట్ల సామర్ధ్యం గల ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ వాహనలను ప్రారంభించాలని చూస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వ్యాపారంపై రూ.1,000 కోట్ల పెట్టుబడిని కేటాయించిన సంస్థ సంప్రదాయ ఇంజిన్ వాహనాలపై కూడా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుంది. హీరో మోటోకార్స్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, ఓలా లాంటి కంపెనీలు ఈ విభాగంలోకి వచ్చిన నేపథ్యంలో హోండా కంపెనీ ప్రవేశం ద్వారా పోటీ మరింత పెరుగుతుందని ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. (చదవండి: డౌన్‌లోడ్‌లో దూసుకెళ్తున్న ఇండియన్ ‘కూ’ యాప్) -
వారెవా! ఏముంది బైక్
చూసీచూడగానే 'వారెవా' అనిపించేలా ఉంది హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వారి గోల్డ్‌వింగ్ టూర్. గత నెల విడుదల చేసిన ఈ బైక్ ఎయిర్ బ్యాగ్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ (డీసీటి) అనే రెండు వేరియెంట్లలో లభ్యం అవుతుంది. 'కంఫర్డ్, లగ్జరీ టాప్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న గోల్డ్వింగ్కు మంచి స్పందన వస్తుంది” అని కంపెనీ చెబుతుంది. ఈ బైక్ ధర ఎంతో తెలుస్తే! మీరు ఒకింత షాక్ అవుతారు. మాన్యూవల్ ట్రాన్స్ మిషన్ బైక్ ధర రూ.37,20,342గా ఉంటే, డీసీటి + ఎయిర్ బ్యాగ్ ధర వచ్చేసి రూ.39,16,055 (ఎక్స్ షో రూమ్, హర్యానా)గా ఉంది. 1,833 సీసీ ఇంజిన్ ఈ గోల్డ్ వింగ్ 1833సీసీ లిక్విడ్ కూల్డ్ 4-స్ట్రోక్ 24-వాల్వ్ ఎస్ వోహెచ్ సీ ఫ్లాట్-6 ఇంజిన్ తో వస్తుంది. ఇది 5,500 ఆర్ పీఎమ్ వద్ద 124.7 హెచ్ పీ, 170 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తుంది. అలాగే, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆష్షన్(డీసీటి) విత్ ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ కూడా ఉంది. 2021 గోల్డ్ వింగ్ హోండా సెలక్టబుల్ టార్క్ కంట్రోల్ (హెచ్ ఎస్ టీసీ)తో వస్తుంది, ఇది విభిన్న రైడింగ్ పరిస్థితుల్లో రియర్ వీల్ ట్రాక్షన్ మానిటర్ చేయడానికి సహాయపడుతుంది. ఇతర ఫీచర్లలో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్(ఐఎస్ జి), ఐడ్లింగ్ స్టాప్(డిసిటి ఆప్షన్ పై), మాన్యువల్-డిసిటి వేరియెంట్లపై హిల్ స్టార్ట్ అసిస్ట్(హెచ్ఎస్ ఎ) ఉన్నాయి. దీనిలోని ఏడు అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్ టి లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే స్క్రీన్ ఆడియో, నావిగేషన్ సిస్టమ్‌ల మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. 2021 గోల్డ్ వింగ్ స్మార్ట్ కీ మోటార్ సైకిల్ యొక్క అన్ని వ్యవస్థలను యాక్టివేట్ చేస్తుంది. ఇగ్నీషన్, హ్యాండిల్ బార్ లాక్ ని కేవలం తీసుకెళ్లేటప్పుడు ఆన్/ఆఫ్ చేయవచ్చు. దీనిలో అప్ గ్రేడ్ చేసిన లైట్ వెయిట్ స్పీకర్లు ఉన్నాయి. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 21.1 లీటర్లు. గురుగ్రామ్ (హర్యానా), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), కొచ్చి (కేరళ), హైదరాబాద్ (తెలంగాణ)లోని బిగ్ వింగ్ టాప్ లైన్ డీలర్ షిప్‌లలో హోండా 2021 గోల్డ్ వింగ్ టూర్ ను బుకింగ్ చేసుకోవచ్చు. -
హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే
సాక్షి, ముంబై: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మంగళవారం రెండు ప్రీమియం బైకులను భారత మార్కెట్లో విడుల చేసింది. ఇందులో ఒకటి సీబీఆర్650ఆర్ కాగా, మరోకటి సీబీ650ఆర్ బైక్. ఇది 649 సీసీ మోటర్ సైకిల్ అప్డేట్ ఎడిషన్‌గా వస్తుంది. ఈ బైకుల ధరలు వరుసగా రూ.8.88 లక్షలు, రూ.8.67 లక్షలుగా ఉన్నాయి. వీటిని విదేశాల నుంచి కంప్లీట్లీ నాక్డ్ డౌన్ యూనిట్ (సీకేబీ) రూపంలో దిగుమతి చేసుకుంటామని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో ప్రీమియం మోటర్‌సైకిళ్ల విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ బైకులను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. హైదరాబాద్ సహా, గురుగ్రామ్ (హర్యానా), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), కొచ్చి (కేరళ)లోని బిగ్ వింగ్ టాప్ లైన్ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ప్రారంభం. -
ద్విచక్ర వాహన అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల విక్రయాలు సెప్టెంబర్‌లో పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఒక్క టీవీఎస్ మోటార్ విక్రయాలు మాత్రం స్వల్పంగా క్షీణతను చవిచూశాయి. దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ 5.0 ప్రారంభం కావడం, కోవిడ్ వ్యాప్తి భయాలతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడం తదితర కారణాలు అమ్మకాలను పుంజుకునేలా చేశాయి. ఈ సెప్టెంబర్‌లో హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల మొత్తం విక్రయాలు 17,33,777 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 15,43, 353 యూనిట్లతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. ఇదే ఏడాది ఆగస్ట్ నెల విక్రయాల(14,41041)తో పోలిస్తే 20 శాతం అధికమని గణాంకాలు చెబుతున్నాయి. అవుట్‌లుక్: కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యక్తిగత రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా వర్షపాతం అంచనాలకు మించి నమోదైంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత స్తబ్ధుగా ఉంది. పండుగ సీజన్ సందర్భంగా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది పట్టణ ప్రాంతంలోని విక్రయాల లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. -
2020 నాటికి బీఎస్–6 వాహనాలు!
హోండా మోటార్‌సైకిల్స్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కీటా మురమత్సు • ప్రస్తుతానికి మార్కెట్లో బీఎస్–4తో సీబీ హార్నెట్, షైన్ బైక్స్ • ఈ నెలాఖరున మార్కెట్లోకి బీఎస్–4 తొలి స్కూటర్ • పెద్ద నోట్ల ప్రభావం నుంచి పట్టణాల్లో కోలుకున్నాం • గ్రామాల్లో సాధారణ స్థితికి మరో మూడునెలలు పట్టొచ్చు • వంద శాతం ప్లాంట్ల వినియోగం తర్వాతే కొత్త ప్లాంట్ శ్రీనాథ్ అడెపు హోండా మోటర్స్ త్వరలో దేశంలోని తన బైకులన్నిటినీ బీఎస్–4 ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చటానికి అన్నీ సిద్ధం చేసింది. అంతేకాక... మరో మూడేళ్లలో బీఎస్–6 ప్రమాణాలతో బైకులు తేవటానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఏ) ప్రెసిడెంట్, సీఈఓ కీటా మురమత్సు చెప్పారు. భారత్ స్టేజ్ –4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన సీబీ షైన్‌ను రాజస్థాన్‌లోని తపుకర ప్లాంట్‌లో విడుదల చేసిన సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదన్న మురమత్సు... తమ సంస్థ తరఫున కూడా డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించే చర్యలు మొదలు పెట్టినట్లు తెలియజేశారు. ఇంటర్వూ్య ముఖ్యాంశాలివీ... అన్ని బైకులూ బీఎస్–4 ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తున్నట్లున్నారు? అవును! ఎందుకంటే రోజురోజుకూ కాలుష్యంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. బైకుల నుంచి కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి కాలుష్య ఉద్గారాలు అధికంగా విడుదలవుతాయి కాబట్టే 2017 నాటికి దేశంలోని వాహనాలన్నీ బీఎస్–4కు, 2020 నాటికి బీఎస్–6కు అప్‌గ్రేడ్ కావాలని కేంద్రం నిబంధనలు పెట్టింది. దానికి తగ్గట్టే మేం మార్పులు చేస్తున్నాం. గతంలో బీఎస్–4 హోండా సీబీ హార్నెట్ 160 ఆర్ బైక్‌ను విడుదల చేశాం. ఇపుడు సీబీ షైన్‌ను తపుకర ప్లాంట్‌లో తయారు చేసి విడుదల చేశాం. మరి మిగిలిన బైకుల సంగతో..? బీఎస్–4 ప్రమాణాలతో తొలి స్కూటర్‌ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తాం. అంతకుమించి వివరాలు చెప్పలేను. యాక్టివా, ఏవిఏటర్, నవీ బైకుల్ని కూడా మారుస్తున్నాం. దశలవారీగా మార్కెట్లోకి తెస్తాం. ఫిబ్రవరి ముగిసే నాటికి విపణిలో హోండా బైకులన్నీ బీఎస్–4వే ఉంటాయి. 2020 నాటికి బీఎస్–6 వాహనాలను తెస్తాం. దీనికోసం హర్యానాలోని మనేసర్‌లో ఆర్ అండ్ డీ జరుగుతోంది. అయితే బీఎస్ ప్రమాణాలతో బైకుల ధరలు రూ.500–1,000 వరకూ పెరుగుతాయి. కొత్త ప్లాంట్లు గానీ, విస్తరణ గానీ ఏమైనా ఉందా? ప్రస్తుతం మాకిక్కడ 4 ప్లాంట్లున్నాయి. మనేసర్(హర్యానా) సామర్థ్యం ఏటా 16 లక్షలు. తపుకరా (రాజస్థాన్) 12 లక్షలు. నర్సాపూర్ (కర్ణాటక) 12 లక్షలు కాగా విఠల్పూర్ (గుజరాత్) ప్లాంట్ 12 లక్షలు. జులైలో నర్సాపూర్ ప్లాంట్‌లో 4వ లైన్‌ను ప్రారంభిస్తాం. దీంతో మొత్తం సామర్థ్యం 64 లక్షలకు చేరుతుంది. ఇవన్నీ నూరుశాతం వినియోగించుకున్నాకే కొత్త ప్లాంట్ ఏర్పాటు యోచన చేస్తాం. ప్రస్తుతం దేశంలో 4,500 డీలర్షిప్స్ ఉండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 5,300కు చేరుస్తాం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం టూవీలర్ పరిశ్రమపై ఎక్కువగానే ఉన్నట్లుంది? 2016–17లో ద్విచక్ర వాహనాల పరిశ్రమ 6 శాతం వృద్ధి సాధిస్తే హోండా మాత్రమే 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్‌లో మాత్రం అమ్మకాలు గ్రామాల్లో 60 శాతం, పట్టనాల్లో 50 శాతానికి పడిపోయాయి. ఇపుడు పట్టణ మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంది. గ్రామాల్లో ఈ పరిస్థితి రావాలంటే మరో రెండు నెలలు పడుతుంది. గతంలో మా మొత్తం నెట్‌వర్క్‌లో 6–7 శాతమే కార్డులను వాడేవారు. ఇపుడది 25 శాతానికి పెరిగింది. నగదు లావాదేవీల్ని ప్రోత్సహించడానికి మేం డౌన్ పేమెంట్‌ను తగ్గించాం. ఎగుమతులు కూడా పెరుగుతున్నట్లున్నాయి? మీ బైకుల్లో ‘షైన్’ బాగా షైన్ అయినట్లుంది...! నిజమే! మా పోర్టుఫోలియోలో షైన్ది ప్రత్యేక స్థానం. 2006లో మార్కెట్లోకి తెచ్చాక ఇప్పటిదాకా 50 లక్షల షైన్ బైకులు విక్రయించాం. 125 సీసీ బైకుల విక్రయాల్లో 36 శాతం వాటా దీనిదే. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం షైన్ అమ్మకాల్ని 64 లక్షలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. 2016 జనవరిలో 3,61,721 బైకులను విక్రయించిన హోండా.. ఈ ఏడాది జనవరిలో 3,68,145 బైకులను విక్రయించింది. అంటే 2% వృద్ధి నమోదయిందన్న మాట. బీఎస్–4 సీబీ షైన్ ప్రత్యేకతలు.. ⇔ 125సీసీ ఆటోమెటిక్ హెడ్‌లైట్ (ఏహెచ్ఓ) బీఎస్–4 సీబీ షైన్ ధర డ్రమ్ బ్రేక్ వర్షన్ రూ.60,675, డిస్క్ బ్రేక్ వర్షన్ రూ.63,000 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ⇔ సింగిల్ సిలిండర్ ఇంజిన్, హోండా ఎకో టెక్నాలజీ (హె చ్ఈటీ), 10.16 హెచ్‌పీ పవర్, 7,500 ఆర్పీఎం, టర్యూ 10.30 ఎన్ఎం. నీలం, ఎరుపు రంగులు. -
ఆంధ్రాబ్యాంక్‌తో హోండా ఒప్పందం
- 11.75% వడ్డీకే ద్విచక్ర వాహన రుణాలు - మహిళలకు అయితే 11 శాతానికే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగల సందర్భంగా అతి తక్కువ రేటుకే ద్విచక్ర వాహనాల రుణాలు ఇచ్చే విధంగా హోండా మోటార్స్, ఆంధ్రాబ్యాంక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 11.75 శాతం వడ్డీరేటుకే హోండా మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు రుణాలు లభిస్తాయి. అదే మహిళల పేరు మీద కొనుగోలు చేస్తే 0.75% తక్కువగా 11శాతానికే రుణాలు ఇవ్వనున్నట్లు హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. వడ్డీని రోజువారీ తగ్గింపు విధానంలో లెక్కించనున్నట్లు ఆంధ్రాబ్యాంక్ జీఎం కె. రంగనాథ్ తెలిపారు. గరిష్టంగా ఐదేళ్ల కాలపరిమితికి ఈ రుణాలను అందిస్తామని, వాహనం విలువలో 85 శాతం లేదా గరిష్టంగా రూ. 5 లక్షల వరకు రుణాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ పండుగుల సీజన్లో తొలిసారి ఒక ప్రభుత్వరంగ బ్యాంక్‌తో ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నామని, దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్మకాలు పెరుగుతాయని హోండా మోటార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్) వైఎస్ గులేరియా విశ్వాసం వ్యక్తంచేశారు. -
హోండా టూవీలర్ల విక్రయాలు @ కోటిన్నర
న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ టూవీలర్ల విక్రయాలు 1.5కోట్ల మైలురాయిని చేరాయి. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన 13 ఏళ్లకు ఈ ఘనత సాధించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.ఎస్. గులేరియా చెప్పారు. ఇంత స్వల్పకాలంలోనే ఈ ఘనత సాధించడం హోండా బ్రాండ్‌పై పెరుగుతున్న వినియోగదారుల నమ్మకానికి నిదర్శనమని వివరించారు. కోటి వాహన విక్రయాలను 2012 జూలైలో సాధించామని, తాజా అరకోటి వాహన అమ్మకాలు 18 నెలల్లోనే సాధించామని వివరించారు. మాస్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లోకి డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో బైక్‌లతో ప్రవేశించామని, ఈ బైక్‌లతోనే మంచి వృద్ధి సాధించామని పేర్కొన్నారు. తమ విక్రయ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తున్నామని, తర్వలో 500 కొత్త టచ్-పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని దీంతో తమ నెట్వర్క్ 2,500కు పెరుగుతుందని గులేరియా వివరించారు. -
హోండా సిటీలో కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: జపాన్ కంపెనీ హోండా... అంతా కొత్తదైన హోండా సిటీ కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా సిటీ బ్రాండ్ కింద ఈ ఫోర్త్ జనరేషన్ మోడల్లో డీజిల్ వేరియంట్‌ను కూడా అందిస్తున్నామని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈవో హిరోనోరి కనయమ తెలిపారు. జపాన్‌లోని తొచిగిలో ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్లో ఈ హోండా కార్లను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. భారత్‌తో సహా ఇతర ఆసియా దేశాల్లో సర్వేలు నిర్వహించి వీటిని రూపొందించామన్నారు. తొలి తరం హోండా సిటీ కారును ఈ కంపెనీ 1998లో భారత్‌లోకి తెచ్చింది. ఇప్పటి వరకూ 4.3 లక్షల కార్లను విక్రయించింది. ఇవీ కొత్త హోండా వివరాలు: ధర: రూ.8.62-11.1 లక్షలు డీజిల్(5 వేరియంట్లు- ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) మైలేజీ: 26 కిలోమీటర్లు పెట్రోల్ వెర్షన్ రూ.7.42 - 10.98 లక్షలు మైలేజీ: 18 కిలోమీటర్లు ఇతర ప్రత్యేకతలు: టచ్ స్క్రీన్ ఆటో ఏసీ, 5 అంగుళాల ఎల్సీడీ మానిటర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ పార్కింగ్ కెమెరా, స్టార్ట్/స్టాప్ బటన్, సన్‌రూఫ్, సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్.