ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఫిబ్రవరి నెల గాను పలు కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ మోడల్ లైనప్‌లో అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ కార్లపై లాభదాయకమైన డీల్‌లను కొనుగోలుదారులకు అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, ఎఫ్‌ఓసీ ఉపకరణాలు, కార్పొరేట్ బోనస్లను హోండా అందిస్తోంది.
హోండా సిటీ 5 జనరేషన్
జపనీస్ కార్‌మేకర్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ హోండా సిటీ మోడల్‌పై ఏకంగా రూ. 33,500 వరకు తగ్గింపుతో రానుంది. క్యాష్ బెనిఫిట్ రూ. 10,000. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ బోనస్ రూ. 8,000 కొనుగోలుదారులు పొందవచ్చు. ఎఫ్‌ఓసీ యాక్సెసరీస్‌పై సుమారు రూ. 10, 500 ప్రయోజనాలను హోండా అందిస్తోంది.
హోండా జాజ్
హోండా జాజ్ కొనుగోలుపై రూ. 33,100 వరకు నగదు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది, ఇందులో క్యాష్ బెనిఫిట్స్ రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ రెండు కలిపి రూ. 12000, కార్పొరేట్ తగ్గింపు రూ. 4000 వరకు లభిస్తాయి. ఎఫ్‌ఓసీ యాక్సెరీస్‌పై రూ. 12,100 మేర ప్రయోజనాలను హోండా అందిస్తోంది.
హోండా డబ్ల్యూఆర్-వీ
ఈ కారు కొనుగోలుపై రూ. 26,100 ప్రయోజనాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ బోనస్ , లాయల్టీ బోనస్ కార్పొరేట్ బెనిఫిట్లను హోండా అందిస్తోంది.
హోండా సిటీ 4 జనరేషన్
హోండా సిటీ 4 జనరేషన్ కారుపై సుమారు రూ. 20వేల వరకు తగ్గింపును హోండా అందిస్తోంది. లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 7,000, హోండా సిటీ కొనుగోలుపై 8,000 కార్పొరేట్ తగ్గింపు రానుంది.
హోండా అమేజ్
హోండా కార్లలో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా హోండా అమేజ్ నిలిచింది. ఫిబ్రవరి నెలకు గాను రూ. 15,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. ఇందులో కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment