ఆంధ్రాబ్యాంక్‌తో హోండా ఒప్పందం | Honda agreement with Andhra Bank | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్‌తో హోండా ఒప్పందం

Published Tue, Sep 29 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

Honda agreement with Andhra Bank

- 11.75% వడ్డీకే ద్విచక్ర వాహన రుణాలు
- మహిళలకు అయితే 11 శాతానికే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
పండుగల సందర్భంగా అతి తక్కువ రేటుకే ద్విచక్ర వాహనాల రుణాలు ఇచ్చే విధంగా హోండా మోటార్స్, ఆంధ్రాబ్యాంక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 11.75 శాతం వడ్డీరేటుకే హోండా మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు రుణాలు లభిస్తాయి. అదే మహిళల పేరు మీద కొనుగోలు చేస్తే 0.75% తక్కువగా 11శాతానికే రుణాలు ఇవ్వనున్నట్లు హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది.

వడ్డీని రోజువారీ తగ్గింపు విధానంలో లెక్కించనున్నట్లు ఆంధ్రాబ్యాంక్ జీఎం  కె. రంగనాథ్ తెలిపారు. గరిష్టంగా ఐదేళ్ల కాలపరిమితికి ఈ రుణాలను అందిస్తామని, వాహనం విలువలో 85 శాతం లేదా గరిష్టంగా రూ. 5 లక్షల వరకు రుణాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ పండుగుల సీజన్‌లో తొలిసారి ఒక ప్రభుత్వరంగ బ్యాంక్‌తో ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నామని, దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్మకాలు పెరుగుతాయని హోండా మోటార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్) వైఎస్ గులేరియా విశ్వాసం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement