న్యూఢిల్లీ :
హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) యాక్టివాలో నాలుగో జనరేషన్(4జీ) మోడల్‌ను విడుదల చేసింది. హెచ్‌ఎంఎస్‌ఐ ఇప్పటికే యాక్టివా 3జీ, యాక్టివా 125, యాక్టివా ఐ అనే మూడు వాహన సిరీస్‌లను వినియోగదారులకు అందిస్తోంది. యాక్టివా 4జీలో కొత్తగా బీఎస్IV ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. ఫ్యామిలీ స్కూటర్గా పేరున్న యాక్టివాలో నాలుగో జనరేషన్, వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుందని హెచ్‌ఎంఎస్‌ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ గులేరియా అన్నారు. ఈ వేరియంట్‌లో మైబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉండనుందని తెలిపారు. అంతే కాకుండా ఈ యాక్టివా 4జీ మరిన్ని ఎక్కువ రంగుల్లో అందుబాటు ఉండనుందని పేర్కొన్నారు.
అడ్వాన్స్డ్ కోంబీ బ్రేక్ సిస్టమ్(సీబీఎస్), కొత్త ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఆన్(ఏహెచ్‌ఓ) ఫీచర్లు యాక్టివా 4జీలో ఉన్నాయి. ఏడు విభిన్న రంగులు..మ్యాట్ సెలెన్ సిల్వర్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ మెటాలిక్, ట్రాన్స్ బ్లూ మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, బ్లాక్, వైట్, మెజిస్టిక్ బ్రౌన్‌లలో యాక్టివా 4జీ లభ్యం కానుంది. భారత టూవీలర్ ఇండస్ట్రీలో 110 సీసీ ఆటోమెటిక్ సెగ్మెంట్ ద్విచక్రవాహనాల అమ్మకాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ సమయంలోనే మరిన్ని సదుపాయాలను కల్పిస్తూ యాక్టివా 4జీ వేరియంట్‌ను విడుదల చేసింది.
హోండా యాక్టివా 4జీ ధర రూ. 50,730 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించారు.
హోండా యాక్టివాలో 4జీ వచ్చేసింది..
Published Wed, Mar 1 2017 6:29 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
Advertisement